Balakrishna : నేడు నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘భగవంత్ కేసరి’, అలాగే తమిళ హీరో విజయ్ నటించిన ‘లియో’ చిత్రాలు గ్రాండ్ గా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. థియేటర్స్ మొత్తం హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడిపోతున్నాయి. ఇలా ఈమధ్య కాలం లో మన టాలీవుడ్ లో చూసి చాలా కాలం అయ్యింది. అయితే భగవంత్ కేసరి చిత్రానికి కాస్త మంచి పాజిటివ్ టాక్ టాక్ రాగా, లియో చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది.
మితిమీరిన అంచనాలే ఈ సినిమాకి ఇలా డివైడ్ టాక్ రావడానికి కారణం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. కానీ ఓపెనింగ్స్ మాత్రం తమిళ వెర్షన్ కి పోటీగా నిలుస్తున్నాయి తెలుగు వెర్షన్ లో కూడా. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్స్ ని నెలకొల్పిన ఈ సినిమా, మొదటి రోజు ఓవరాల్ గా వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాదిస్తుందని అంటున్నారు.
ఇకపోతే ఈ సినిమా తెలుగు లో బాలయ్య లాంటి మాస్ హీరో సినిమా ఓపెనింగ్స్ ని కూడా డామినేట్ చేస్తుంది. దశాబ్దాల నుండి నందమూరి ఫ్యామిలీ కి కంచుకోట గా నిల్చిన సీడెడ్ ప్రాంతం లోని ప్రతీ సెంటర్ లో లియో చిత్రం ‘భగవంత్ కేసరి’ కలెక్షన్స్ కంటే డబుల్ మార్జిన్ తో ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది.
అలాగే బాలయ్య కి కంచుకోటలుగా చెప్పుకునే ఒంగోలు , కందుకూరు వంటి ప్రాంతాలలో కూడా లియో చిత్రమే లీడింగ్ గా ఉన్నది.ఇది ట్రేడ్ పండితులకు సైతం ఆశ్చర్యాన్ని కలగచేస్తున్న విషయం. లియో చిత్రం కి యూత్ ఆడియన్స్ ఎక్కువ మొగ్గు చూపారు. కానీ టాక్ ‘భగవంత్ కేసరి’ కంటే తక్కువే ఉండడం తో లాంగ్ రన్ లో కచ్చితంగా ‘లియో’ పై లీడింగ్ తీసుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.