ఏంటి నిజామా? కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందా?

- Advertisement -

కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమా హిట్ అవ్వడంతో తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమాలను చేస్తూ వస్తుంది.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది.. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసింది. గత కొంతకాలం గా సరైన హిట్ సినిమా లేకపోవడంతో తన చిన్ననాటి ఫ్రెండ్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఒక బిడ్డకు తల్లయింది.. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తుంది.. ఈ మధ్య హాట్ ఫోటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంది.. రోజుకో యాంగిల్స్ తో పిచ్చెక్కిస్తుంది..

కాజల్
కాజల్

అయితే, తాజాగా ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని ఓ వార్త వైరల్ అవుతుంది.. అందుకు కారణం కూడా ఉందట.. ఇప్పటి వరకు కాజల్ కమిట్ అయిన లను కంప్లీట్‌ చేసి.. సినిమాలకు మరో బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారట. తన బాబు ఎదుగుతున్న వేళ.. తన కొడుకు ఆలనా పాలనా దగ్గరుండి మరీ చూసుకోవాలని అనుకుంటుందట.. తల్లిగా తన బాధ్యతలు పర్ఫెక్ట్ గా నిర్వహించాలని కాజల్ భావిస్తుందట.. తన భర్త కిచ్లూ కూడా ఇదే చెబుతున్నారట.. అందుకే కాజల్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది..

ఇక కాజల్ త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో ఇదే టాక్ వినిపిస్తుంది.. అయితే ఇందులో నిజం ఎంతో తెలియాలంటే.. కాజల్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు సినిమాలో నటిస్తుంది.. అలాగే బాలయ్య భగవంత్‌ సింగ్ సినిమాలో కూడా నటిస్తుంది.. ఆ రెండు సినిమాలు పూర్తయ్యాక సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here