Balagam మంచి సినిమాని ఆదరించడం లో ముందు ఉండే ఇండస్ట్రీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ..అద్భుతమైన కథ ఉంటే చాలు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు ఇలాంటివేమీ చూడకుండా థియేటర్స్ కి క్యూలు కట్టేసి బ్రహ్మరథం పట్టేస్తారు.రీసెంట్ గా విడుదలైన ‘బలగం’ సినిమాకి కూడా అదే జరిగింది.ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి జబర్దస్త్ టాప్ కమెడియన్ ‘వేణు టిల్లు’ దర్శకత్వం వహించగా, టాలీవుడ్ ప్రస్తుత టాప్ లీడింగ్ కమెడియన్స్ లో ఒకరిగా కొనసాగుతున్న ప్రియదర్శి హీరో గా నటించాడు.
కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది.పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యం లో ఎంతో ఆహ్లదకరం గా సాగిపోయిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ అయ్యింది.ఇలాంటి సృజనాత్మకత ఉన్న సినిమాలను కేవలం జనాలు మాత్రమే కాదు, మన భారత దేశ ప్రభుత్వం కూడా గుర్తిస్తాది.
ఇప్పుడు ‘బలగం’ సినిమాకి కూడా జాతీయ అవార్డు దక్కుతుందా అని ఇప్పటి నుండే ప్రిడిక్షన్స్ ప్రారంభం అయ్యాయి.ఈ సినిమాకి జాతీయ అవార్డు పొందే అన్నీ అర్హతలు ఉన్నాయి.గ్రామీణ నేపథ్యం ని వెండితెర మీద అద్భుతంగా చూపించే ప్రయత్నం చేసినందుకు దర్శకుడు వేణు ని ఎంత ప్రశంసించిన అది తక్కువే అవుతుంది.
ఆయనని భారత దేశ ప్రభుత్వం కచ్చితంగా గుర్తించాల్సిందే. ‘బలగం‘ కేవలం డబ్బుల కోసం మాత్రమే కాదు, అప్పుడప్పుడు విలువలతో కూడిన ఇలాంటి గొప్ప సినిమాలు తియ్యాలి అని ముందుకొచ్చిన నిర్మాత దిల్ రాజు ని కూడా భారత ప్రభుత్వం గుర్తించాల్సిందే.గుర్తిస్తేనే రాబోయే రోజుల్లో ఇలాంటి గొప్ప సినిమాలను ఎన్నో మనం చూడగలము.ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నిర్మాత మరియు ఉత్తమ సినిమా క్యాటగిరీలలో నేషనల్ అవార్డు పొందే అర్హతలు మెండుగా ఉన్నాయి.మరి ప్రభుత్వం ఇది గుర్తిస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్న , గుర్తిస్తే మాత్రం ఒక తెలుగు సినిమా లవర్ గా ప్రతీ ఒక్కరు ఎంతో గర్విస్తారు.