Monal : తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ సిమ్రాన్. 1999 నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు. 1976 ఏప్రిల్ 4న ముంబైలో జన్మించిన ఆమె తొలుత తమిళ చిత్రాల్లో నటించారు. ఆమెకు ఓ చెల్లెలు మోనల్ కూడా ఉండేవారు. సిమ్రాన్ చెల్లెలిగా మోనల్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్క నటనకు వారసత్వంగా తీసుకుని ఢిల్లీలో డిగ్రీ చేస్తున్న సమయంలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కన్నడ మూవీ `ఇంద్రధనుష్`తో మోనాల్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత హిందీతో పాటుగా, పలు తమిళ సినిమాల్లో కూడా నటించింది. కోలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ `బద్రి`లో చిన్న పాత్ర చేసి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో కేవలం ‘ఇష్టం’ అనే చిత్రంలోనే నటించింది. అయితే సరిగ్గా 21ఏళ్లకే మోనల్ ఆత్మహత్య చేసుకున్నారు. 2002 ఏప్రిల్ 14న సూసైడ్ చేసుకుని ఈ లోకాన్ని విడిచి పెట్టారు.
ఈ సంఘటన సిమ్రాన్ తో సహా కుటుంబసభ్యులను, సినీ ప్రముఖులను తీవ్ర వేదనకు గురి చేసింది. అయితే ఎంతో భవిష్యత్ ఉన్న మోనాల్ అంత చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవడానికి కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజిత్ కారణమని అప్పట్లో సిమ్రాన్ తీవ్ర ఆవేదన చెందారు. ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరై.. అవసరం తీరగానే బ్రేకప్ చెప్పి సదరు కొరియోగ్రాఫర్ మోనాల్ ను దారుణంగా మోసగించాడట. ఆ బాధ తట్టుకోలేక మోనాల్ చనిపోయిందని ప్రచారం జరిగింది.
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. తనకు తగిన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ సీనియర్ భామ తెలుగులోనూ సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సమరసింహ రెడ్డి, కలిసుందాం రా, నరసింహనాయుడు, డాడీ, సీతయ్య, ఒక్క మగాడు’ వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం కూడా సీనియర్ నటిగా ఇప్పటికీ వరుసగా అవకాశాలు అందుకుంటోంది.