ఒక పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రెండు మహా సముద్రాలు లాంటి వ్యాపకాల్లో ఒకేసారి ప్రయాణించడం అంటే సాధారమైన విషయం కాదు. పవన్ కళ్యాణ్ ఆ అసాధారణమైన టాస్కులను సుసాధ్యం చేసాడు. అందుకే ఆయనని అభిమానులు అంతలా ఆరాధిస్తుంటారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం ఎన్నో త్యాగాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
‘అత్తారింటికి దారేది’ వంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ రేంజ్ టాలీవుడ్ స్టార్ హీరోలెవ్వరూ దరిదాపుల్లోకి కూడా రాని విధంగా మారింది. అలాంటి సమయం లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. పార్టీ కార్యాలయం ని నిర్మించడానికి డబ్బులు సరిపోకపోతే కొడుకు అకిరా నందన్ మరియు కూతురు ఆద్య పేరు మీద చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ ని కూడా బ్రేక్ చేసాడు, ఇలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి.
ఇలా తన జీవితాన్ని మొత్తం సమాజ సేవకి అనికితం చేసాడనే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడిపోయింది అంటూ సోషల్ మీడియా లో వార్తలు కూడా వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గత ఏడాది నుండి తన పెద్ద కొడుకు అకిరా నందన్ తో దూరంగా ఉంటున్నాడు అని తెలుస్తుంది. అందుకు కారణం వాళ్ళ ఇద్దరి మధ్య గొడవే అని, అందుకే వరుణ్ తేజ్ నిశ్చితార్ధ వేడుకల్లో అకిరా కనిపించలేదని, ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.
వీటిల్లో ఏది నిజం ఏది అబద్దం అనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ కనీసం ఊపిరి తీసుకోలేనంత బిజీ గా ఉన్నాడని. రామ్ చరణ్ కి కూతురు పుడితే ఇప్పటి వరకు చూడలేకపోయాడని, వాళ్ళిద్దరి మధ్య దూరం ఏర్పడడానికి కారణం కేవలం బిజీ గా ఉండడం వల్లే అని అంటున్నారు ఫ్యాన్స్. ఇదంతా పక్కన పెడితే అకిరా నందన్ రీసెంట్ గా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ దిగిన వీడియో కి సోషల్ మీడియా లో బంపె రెస్పాన్స్ ని దక్కించుకుంది.అప్పటి నుండి సోషల్ మీడియా లో ఈమధ్య అకిరా పవన్ కళ్యాణ్ ని కలిసినట్టుయి లేదే అని గమనించి ఇలాంటి వార్తలని వ్యాప్యి చేసారు.