Sridevi : అందరూ చూస్తుండగా హీరోయిన్ శ్రీదేవి ని చెప్పుతో కొట్టింది ఎవరు..? ఆ తర్వాత ఏమి జరిగింది!

- Advertisement -

Sridevi : మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి పాన్ ఇండియన్ స్టార్ అనే పదానికి అర్థం తీసుకొచ్చిన మహా నటి ఎవరు అంటే మన అందరికీ టక్కుమని గుర్తుకు వచ్చే పేరు శ్రీదేవి.స్వర్గ లోకం లో రంభ, ఊర్వశి మరియు మేనకాలను కలగలిపి ఒక మనిషి రూపం లో తయారు చేసి ఆ దేవుడు శ్రీదేవిని భూమి పైకి పంపించాడా అనేంత అందం ఈమె సొంతం.కేవలం అందం లోనే కాదు, నటనలో కూడా ఈమె ఒక నిఘంటువు లాంటిది.

Sridevi
Sridevi

అలనాటి సూపర్ స్టార్స్ ఎన్టీఆర్, ANR , కృష్ణ, శోభన్ బాబు మరియు కృష్ణం రాజు వంటి వారితో నటించిన శ్రీదేవి, ఆ తర్వాతి తరం సూపర్ స్టార్స్ లో చిరంజీవి, వెంకటేష్ మరియు నాగార్జున లతో కూడా నటించింది, తమిళం , కన్నడం మరియు మలయాళం బాషలలో కూడా దాదాపుగా అందరి హీరోల సరసన నటించిన శ్రీదేవి,ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా నెంబర్ 1 హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.

Actress Sridevi

అలా ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ ని, ఒక స్త్రీ సినిమా ఫంక్షన్ అతిరథ మహారథుల సమక్షం లో చెప్పు తీసుకొని కొట్టి అవమానించింది అంటే ఎవరైనా నమ్ముతారా..?,కానీ నమ్మక తప్పదు,ఎందుకంటే అది జరిగిన విషయం కాబట్టి. అసలు విషయానికి వస్తే బోణి కపూర్ కి పెళ్ళై ఇద్దరు పిల్లలు కలిగి ఉన్నా కూడా శ్రీదేవి ని ప్రేమించాడు.ఈ విషయం ఆమెకి కూడా తెలుసు, తొలుత బోణి కపూర్ తో ప్రేమాయణం నడిపే విషయం లో కాస్త ఆలోచించిన శ్రీదేవి, ఆ తర్వాత అతనితో డేటింగ్ చెయ్యడానికి ఒప్పుకుంది.

- Advertisement -
Sridevi Family

కొన్నాళ్ళకు ఈ విషయం మీడియా ద్వారా బయటకి వచ్చి బోణి కపూర్ భార్య తీవ్రమైన మనస్తాపానికి గురై విడాకులు ఇచ్చేసింది. అప్పటి నుండి బోణి కపూర్ తల్లికి శ్రీదేవి అంటే అసహ్యం ప్రారంభం అయ్యింది అట, ఒక రోజు సినిమా ఫంక్షన్ లో శ్రీదేవి కనిపిస్తే చెప్పు తీసుకొని కొట్టిందట. ఈ విషయం అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. ఇది చాలా కాలం తర్వాత ఈమధ్యనే సోషల్ మీడియా లో బయటపడి ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here