Singer Sunitha : టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేవలం ఆమె పాడే పాటలు వింటే చాలా హాయిగా అనిపిస్తుంది. ఆమె గానం, గాత్రం చాలా బాగుంటుంది. అందంతో పాటు గాత్రం చాలా కొద్దిమందికే ఉంటుంది అలాంటి వారిలో సునీత ఒకరు. అలాగే ఆమె మాట్లాడితే అది ఇతరులకు పాటలా అనిపిస్తుంది. ఎంతో మంది స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ క్యూటీ. అయితే ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఈ గాయని జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి.
గాయని సునీత మొదటి భర్త గురించి చాలా మందికి తెలియదు. ఆమె తొలి పెళ్లి సినిమాటిక్ స్టైల్లో జరిగింది. ఆమె అతడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు 19 ఏళ్లు మాత్రమే. ఆమె మొదటి భర్త పేరు కిరణ్. అతను కూడా ఇండస్ట్రీకి చెందిన వాడు. ఆమె గాయని అయిన తర్వాత, అందరూ ఆమెను ప్రశంసించడం ప్రారంభించారు.
17 ఏళ్ల వయసులో అతడే ఆమెకు ఐ లవ్ యూ చెప్పాడట. దీనికి ఆమె వెంటనే నో చెప్పింది. దాదాపు ఏడాదిన్నర పాటు ఆమెనే ప్రేమిస్తుండడం చూసి అప్పుడు ఓకే చెప్పిందట. దాని తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని విబేధాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సునీత ప్రస్తుతం తన రెండో భర్తతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.