Bigg Boss : రవితేజ కోసం బిగ్ బాస్ టైటిల్ ని త్యాగం చేసిన అమర్ దీప్..చరిత్రలో ఇదే తొలిసారి!

- Advertisement -

Bigg Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అన్నీ ఎమోషన్స్ ని తారాస్థాయిలో పండించి షో మొత్తం తన వైపు తిప్పుకునేలా చేసిన అద్భుతమైన ఎంటర్టైనర్ అమర్ దీప్ అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతీ ఎపిసోడ్ లో అమర్ దీప్ హైలైట్ అవుతూ వచ్చాడు. మిగతా కంటెస్టెంట్స్ స్క్రీన్ టైం ని మొత్తం తినేసాలా చేసాడు. ఈ రేంజ్ ఎంటర్టైనర్ బిగ్ బాస్ అన్నీ సీజన్ కలిపినా లేడని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అంతే కాదు చుట్టూ తనపై 80 కెమెరాలు ఫోకస్ చేస్తున్నాయి, కోట్లాది మంది తెలుగు ప్రజలు తనని చూస్తున్నారు అనేది కూడా లేకుండా, మొదటి రోజు నుండి తనకి నచ్చిన పని చేసుకుంటూ, ఎలాంటి ఫిల్టర్ లేకుండా రియల్ గా ఆడిన ఏకైక కంటెస్టెంట్ అతనే. కొన్ని సార్లు అమర్ ని చూస్తే జాలి వేసింది, కొన్ని సార్లు కోపం కూడా వచ్చింది.

మంచి అయినా చెడు అయినా షో మొత్తం తనవైపు తిరిగింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే అమర్ దీప్ రవితేజ కి ఎంత పెద్ద వీరాభిమాని అనేది మన అందరికీ తెలిసిందే. ఈరోజు జరగబోయే గ్రాండ్ ఫినాలే కి రవితేజ ముఖ్య అతిథిగా విచ్చేశాడు, రవితేజ ని చూడగానే మురిసిపోయిన అమర్ దీప్ ని చూసి నాగార్జున ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

- Advertisement -

టాప్ 5 కంటెస్టెంట్స్ మిగిలినప్పుడు నాగార్జున అమర్ తో మాట్లాడుతూ ‘ఇప్పుడు నువ్వు బయటకి వచ్చేస్తే, రేపు రవితేజ తదుపరి చిత్రం లో ఆయనతో పాటు కలిసి నటించే ఛాన్స్ ఇప్పిస్తా’ అని అంటాడు. అంతే క్షణం కూడా ఆలోచించకుండా గేట్ దగ్గరకి వచ్చేస్తాడు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటుగా, పాత కంటెస్టెంట్స్ కూడా షాక్ కి గురి అవుతారు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here