సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం ‘మహర్షి’.ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా, అప్పట్లో మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.అంతే కాదు ఈ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాలో వీకెండ్ ఫార్మింగ్ అనే అంశం అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఇలాంటి గొప్ప ప్రయత్నం చేసినందుకు మహేష్ బాబు ని మరియు డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని మెచ్చుకున్నారు.
ఇక ఈ చిత్రం లో మహేష్ బాబు తర్వాత మంచి పేరు దక్కించుకున్న నటుడు అల్లరి నరేష్. ఇందులో ఆయన పాత్ర ఎంతో ఎమోషనల్ గా ఉంటుంది, స్నేహం కోసం మరియు తనని నమ్ముకున్న వారి కోసం కెరీర్ ని మరియు ప్రాణాలను కూడా లెక్కచెయ్యని పాత్రలో ఇందులో అల్లరి నరేష్ జీవించాడు.
అయితే ఈ పాత్ర కోసం అల్లరి నరేష్ ని సంప్రదించే ముందు పలువురి యంగ్ హీరోల పేర్లు అనుకున్నాడట డైరెక్టర్ వంశీ పైడిపల్లి.వారిలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకడు.ఈ సినిమా కి ముందు సాయి ధరమ్ తేజ్ వరుసగా ఆరు డిజాస్టర్ ఫ్లాప్స్ తో కెరీర్ ని రిస్క్ లో పడేసుకున్నాడు.అలాంటి సమయం లో ఈ పాత్ర చెయ్యడం వల్ల ఆయనకీ ఎంతో మైలేజ్ వస్తుంది అని వంశీ పైడిపల్లి సాయి ధరమ్ తేజ్ గురించి ఆలోచించాడట.
కానీ ఎందుకో సాయి ధరమ్ తేజ్ ఆ పాత్ర చెయ్యడానికి ఇష్టపడలేదు. తర్వాత ఆ పాత్ర అల్లరి నరేష్ చేతికి వెళ్ళింది, ఇక ఆ తర్వాత ఎలాంటి ప్రశంసలు వచ్చాయో మన అందరికీ తెలిసిందే.ఈ చిత్రం నుండే అల్లరి నరేష్ కూడా కామెడీ సినిమాలను పక్కన పెట్టి నటనకి ప్రాధాన్యం ఉన్న స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.