Geetu Royal : జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బుల్లితెరపై కనిపిస్తూనే సోషల్ మీడియాలో హాట్ బాంబ్ ల ఫోటోలకు పోజులుస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త యాంగిల్స్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..అయితే తాజాగా వర్ష ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో వైరల్ అవుతుంది.. బిగ్ బాస్ ఫెమ్ గీతూ రాయల్ వీడియో వైరల్ అవుతుంది..ఆ వీడియోలో గీతూ రాయల్ చేసిన కామెంట్స్ కొత్త అనుమానాలకు దారి తీస్తున్నాయి… ఎందుకు ఆ వీడియోను పెట్టిందంటూ రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి..

అసలేం ఉందంటే..గీతూ మాట్లాడుతూ..మనల్ని ఎవరైనా మోసం చేయగలరు. నమ్మక ద్రోహం మాత్రం నమ్మిన వాళ్లే చేయగలరు, అన్నారు. వర్ష ఈ వీడియో పోస్ట్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ నడుస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియా పోస్ట్స్ ఒకరి మానసిక స్థితి, వారి ప్రస్తుత కండీషన్ తెలియజేస్తున్నాయి. మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకు ఆవేదన తెలిసేలా చేసేందుకు సోషల్ మీడియా పోస్ట్స్ ఉపయోగపడుతున్నాయి.. ముఖ్యంగా సెలెబ్రేటీలకు సోషల్ మీడియా బాగా ఉపయోగ పడుతుంది.. ఎవరినైనా తిట్టాలనుకున్న, ఏదైనా నిజాన్ని బయటపెట్టాలన్న సోషల్ మీడియానే వాడుకుంటున్నారు. పోస్ట్స్ ద్వారా మనసులోని భావాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో వర్ష తనకు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తులను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారనే ప్రచారం జరుగుతుంది.

ఇక వర్ష ఎందుకు ఆ పోస్ట్ పెట్టారో అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..వర్ష చాలా కాలంగా జబర్దస్త్ షోలో కొనసాగుతున్నారు. ఒకప్పుడు ఈమె సీరియల్ నటిగా ఉన్నారు. జబర్దస్త్ ఆమెను ఓవర్ నైట్ స్టార్ చేసింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో వర్ష సందడి చేస్తున్నారు. ఇమ్మానియేల్ లో వర్ష లవ్ ట్రాక్ కొనసాగుతుంది.
బుల్లితెర ప్రేమికులుగా అవతరించిన వర్ష-ఇమ్మానియేల్ తమ రొమాన్స్ తో ప్రేక్షకులను ఎంటర్టైనర్ చేస్తున్నారు. గతంతో పోల్చితే ఈ మధ్య కొంచెం తగ్గించారు. అప్పట్లో వరుసగా కొన్ని క్రేజీ స్కిట్స్ ఇద్దరిపై తెరకెక్కాయి.. అంతేకాదు ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచుతు.. పొట్టి బట్టల్లో విపరీతమైన స్కిన్ షో చేస్తున్నారు వర్ష.. వర్ష తీరుకు అభిమానులు షాక్ అవుతున్నారు.. ఏది ఏమైనా గీతూ వీడియో పై గుసగుసలు వినిపిస్తున్నాయి.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది..