Kalki : కల్కిలో ప్రభాస్ కు తల్లిగా హాట్ అండ్ యంగ్ హీరోయిన్.. మీరు అస్సలు ఊహించలేరు..?

- Advertisement -

Kalki : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. జూన్ 27న ఈ సినిమా థియేటర్లోకి రానున్న సంగతి తెలిసిందే. అంటే మరి కొద్ది గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంది. కల్కి సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు రోజుకోకటి వైర‌ల్ అవుతునే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఆ సినిమాలో ఓ యంగ్ హీరోయిన్ ప్రభాస్ కు తల్లి గా నటించింది అంటూ వార్తలు వైర‌ల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ దూసుకుపోతుంది. ఇలాంటి క్రమంలో ప్రభాస్‌కు తల్లి పాత్రలో అమ్మడు నటించిందని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా.. తను మరెవరో కాదు మృణాల్ ఠాగూర్. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. టాలీవుడ్ ప్రేక్షకుల్లో అచ్చ తెలుగు అమ్మాయి అనే ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. హ‌య్ నాన్న సినిమాతో తెలుగులో మరో సక్సెస్ కొట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే త‌న సినిమాల్లో ట్రెడిషనల్ లుక్కుతో ఆకట్టుకునే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం తనలోని మరో యాంగిల్ చూపిస్తుంది. హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు కిక్కు ఎక్కిస్తుంది. ఇక చివరిగా విజయ్ తో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

- Advertisement -

కల్కి సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ ఓ కీలక పాత్రలో నటించిదంటూ కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మృణాల్ కల్కి సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిందంటూ ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ చిన్నతనంలో ఆయనకు తల్లి పాత్రలో మృణాల్‌ నటించింది అంటూ సమాచారం. అయితే ఇందులో అసలు నిజంగానే మృణాల్‌ పాత్ర ఉందా..? లేదా..? ఉంటే అది ప్రభాస్ తల్లి పాత్రనా..? అనే దానిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుంచి మాత్రమే ఈ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here