Mamitha : మమిత బైజు -ప్రియాంక అరుళ్ మోహన్ ఫాన్స్ మధ్య గొడవకు కారణమేంటి!!

- Advertisement -

Mamitha : ప్రేమలు మూవీ మలయాళంలో ఎంత హిట్ అయ్యిందో తెలుగులో కూడా అంతే పెద్ద హిట్ అయ్యింది. ఈమూవీ హిట్ అవ్వడానికి ముఖ్య కారణాల్లో హీరోయిన్ మమిత బైజు ఒకరు. ఆమె చేసిన యాక్టింగ్ కు తెలుగు యువత కూడా ఫిదా అయిపోయారు. మమిత ఇప్పటి వరకు ఒక్క తెలుగు మూవీ కూడా చెయ్యకపోయినా కూడా తెలుగు ఆడియన్స్ ఆమెను చాలా ఓన్ చేసుకున్నారు. ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కు, క్యూట్ యాక్టింగ్ కు యూత్ బాగా అట్ట్రాక్ట్ అవుతున్నారు. పైగా ఎలాంటి మోడరన్ డ్రెస్ లు వెయ్యకుండానే ఆమె చాలా మంచిగా కనిపించడంతో ఆమెను తెలుగు ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు.

అయితే ఇప్పుడు ఇంటర్నెట్ లో రచ్చ జరుగుతుంది. అదేంటంటే ప్రియాంక అరుళ్ మోహన్ తో మమితను పోల్చుతూ ఇంటర్నెట్ లో డిస్కషన్ జరుగుతుంది. లేటెస్ట్ గా ప్రియాంక చేసిన ఫోటో షూట్ పిక్స్ పోస్ట్ చేస్తూ.. 100 మమితలను ప్రియాంక బ్రేక్ ఫాస్ట్ గా తినగలదని అంటూ ఫన్నీ డిస్కషన్స్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ప్రియాంక పోస్ట్ చేసిన పిక్స్ మాత్రం చాలా బాగున్నాయి. వైట్ శారీలో ఆమె దిగిన ఫొటోస్ మెంటలెక్కిస్తున్నాయి.

అయితే ఈ డిస్కషన్ అనవసరమని, మమిత కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యిందని, ప్రియాంక ఇప్పటికే చాల మూవీస్ చేసింది కాబట్టి పోల్చడం తప్పని మరి కొందరు అంటున్నారు. అయితే ఈమధ్యన ప్రియాంక హాట్ ఫోటో షూట్ కూడా చేస్తున్నారు. అలాగే మమితకు తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయని సినీ వర్గాలు చెప్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here