టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ స్పై. ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్య మేనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఈ నెల 29న విడుదల కాబోతోంది. కార్తికేయ2తో పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ సంపాదించుకున్న నిఖిల్ స్పై సినిమాతో మరోసారి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నాడు. చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటిసారిగా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

ఓ వివాదాస్పద కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న కథ అని ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమైంది. భారత దేశ స్వాతంత్రం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ నడిపిన సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సినిమా యూనిట్ తెలిపింది. సుభాష్ చంద్రబోస్ మరణించారా లేదా అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాల రన్ టైమ్ ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో అక్కడి నుంచి ఫస్ట్ టాక్ వచ్చింది. ఈ సినిమా స్టోరీ పాయింట్‌ను పూర్తిగా వెల్లడించలేదు. అయితే చరిత్ర నుంచి కనుమరుగైన సుభాష్ చంద్రబోస్ గురించి తెలియని కొన్ని నిజాలు బయటపెడుతున్నట్లు సమాచారం.

అలాగే సుభాష్ చంద్రబోస్ శత్రువుల చేతిలో పడి ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లు సమాచారం. అయితే స్టోరీ పాయింట్ బాగుందని టాక్. కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందని, తర్వాత కథనం కాస్త స్లోగా అనిపించిందని, ఫ్రీ ఇంటర్వెల్ నుంచి అద్భుతమైన స్ర్కీన్ ప్లేతో సినిమా సాగుతుందని తెలియజేశారు. ఎండింగ్ సూపర్‌గా ఉంటుందన్నారు. ఈ సినిమా సీరియస్ స్టోరీ అని అన్నారు. క్వాలిటీ పరంగా సినిమా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయట. మరి నిఖిల్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతాడో లేదో చూడాలి.