ఇటీవల కాలంలో సినిమాల్లో ఏ మేరకు వల్గారిటీ పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకానొక టైంలో సినిమాలు కథా బలంతో హిట్ అయ్యేవి. రానురాను పరిస్థితి దారుణంగా మారిపోయింది. సినిమాల్లో కథ లేకపోగా వల్గారిటీ పెరిగిపోయింది. వల్గర్ డైలాగ్స్, బోల్డ్ సీన్స్, లిప్ లాక్స్ ఎన్ని ఎక్కువ ఉంటే ఆ సినిమా అంత హిట్ అవుతుంది. ఎప్పుడైతే ఓటీటీ మనుగడలోకి వచ్చిందో అప్పటి నుంచి వల్గారిటీ ఓ రేంజ్ లో పెరిగిపోయింది.

కంటెంట్ లేకపోగా బోల్డ్ సీన్స్ తోనే సినిమాలను తెరకెక్కిస్తున్నారు కొందరు డైరెక్టర్లు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెరిగిపోయాయి. ఓటీటీలో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్లు ఎంత దారుణంగా ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇటీవల రీలీజ్ అయిన ట్రయల్, లస్ట్ స్టోరీస్ 2, జీకర్దా వెబ్ సిరీసులు మరీ దారుణంగా ఉన్నాయి. దీంతో వల్గర్ కంటెంట్ ఎక్కువ అయిపోతుందంటూ జనాలు మండిపడుతున్నారు. ఇదే విషయం పై ఇటీవల రాజ్యసభ లో పెద్ద చర్చ జరిగింది.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో సినిమాలకు సంబంధించి కొత్త బిల్లును ప్రవేశపెట్టాలను చూస్తుంది కేంద్రం. సభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రవేశపెట్టారు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రి అనురాగ్ ఠాకూర్ . సినిమాటోగ్రఫీ 1952 బిల్ కు సవరణలు చేస్తూ ఆయన లోక్ సభలో ఈ బిల్ ప్రవేశపెట్టగా అక్కడ పాస్ అయింది. తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ బిల్ ని రాజ్యసభ పాస్ చేసింది.

ఈ బిల్ లో పలు అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా పైరసీ, సెన్సార్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ బిల్ పాస్ అయినా తర్వాత కొందరు మినిస్టర్లు ఓటీటీలో వల్గర్ కంటెంట్ ఎక్కువ అయిపోతుందని.. దానిని నియంత్రించాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించి.. ‘ఇకనుంచి ఓటీటీలో హద్దులు మీరిన శృంగార సన్నివేశాలు ఉంటే సెన్సార్ తీసుకొస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఓటీటీ సంస్థలతో సమావేశం జరిగిందని వారికి స్వీయ నియంత్రణ అవసరం అనే విషయం పై చర్చించినట్లు తెలిపారు.