Bro Collections : ‘బ్రో ది అవతార్ ‘ రెండవ రోజు వసూళ్లు.. చాలా ప్రాంతాలలో మొదటి రోజు కంటే ఎక్కువ షేర్స్!

- Advertisement -

Bro Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం రీసెంట్ గానే విడుదలై ఫ్యామిలీ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ఎన్ని దక్కించుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదట్లో ఈ చిత్రానికి ఫ్యాన్స్ నుండి కాస్త డివైడ్ టాక్ వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునే ఎలివేషన్ షాట్స్, ఫైట్స్ ఇలా అన్నీ ఈ సినిమాలో లేకపోవడం వల్లే అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు.

Bro Collections
Bro Collections

కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకున్నారు. రెండవ రోజు నుండి థియేటర్స్ ఎక్కడ చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ తో కళకళలాడిపోయింది. రెండవ రోజు అయితే చాలా థియేటర్స్ లో మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఇది ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయిన విషయం. ఓవరాల్ గా రెండవ రోజు ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.

నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి నిన్న ఒక్కరోజే నాలుగు కోట్ల 80 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. రెండు రోజులకు 14 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చినట్టు సమాచారం. ఈ చిత్రం అన్నీ ప్రాంతాలలో దుమ్ము లేచిపోయే రేంజ్ వసూళ్లను రాబడుతుంది కానీ, సీడెడ్ లో మాత్రం ఆశించిన స్థాయి వసూళ్లు రావడం లేదు. అక్కడ ఇలాంటి చిత్రాలకు రన్ ఉండదు అనే విషయం అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగానే వసూళ్లు కూడా వస్తున్నాయి.

- Advertisement -

మొదటి రెండు రోజులకు కలిపి ఈ చిత్రానికి ఆ ప్రాంతం లో నాలుగు కోట్ల రూపాయిల షేర్ బ్రో వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇది భీమ్లానాయక్ చిత్రం మొదటి రోజు వసూళ్లతో సమానం అన్నమాట. అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా రెండవ రోజు 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రెండు రోజులకు కలిపి 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here