Thandel : వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన అక్కినేని నాగచైతన్య, ఒక భారీహిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కేవలం నాగ చైతన్య కి మాత్రమే కాదు, ఆయన కొత్తబొయ్యే హిట్ అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి కూడా బాగా ఉపయోగపడాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. నాగ చైతన్య కూడా అభిమానుల రిక్వెస్ట్ ని పరిగణలోకి తీసుకొని ఇక నుండి ప్రతిష్టాత్మక సినిమాలను మాత్రమే చేస్తానని మాట ఇచ్చాడు.
అందులో భాగంగానే రీసెంట్ కార్తికేయ సిరీస్ దర్శకుడు చందూ మొండేటి తో ఒక సినిమా చేస్తున్నాడు. గీత ఆర్ట్స్ మీద అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘తండేల్’ అనే పేరు ని ఖరారు చేసారు. రీసెంట్ గానే నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని విడుదల చేసారు. నాగ చైతన్య లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కెరీర్ ని మలుపు తిప్పే పాత్ర పడబోతోంది అని అభిమానులు కూడా అనుకుంటున్నారు.
అదంతా పక్కన పెడితే ఈ ‘తండేల్’ టైటిల్ పై సోషల్ మీడియా లో బాగా ట్రోల్ల్స్ వచ్చాయి. ఇదేమి టైటిల్ రా బాబు, అసలు తండేల్ అంటే అర్థం ఏమిటి అంటూ ఫ్యాన్స్ దగ్గర నుండి ప్రేక్షకుల వరకు ప్రతీ ఒక్కరు డైరెక్టర్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు. రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న డైరెక్టర్ చందూ మొండేటి ‘తండేల్’ అంటే అర్థం ఏమిటో చెప్పుకొచ్చాడు.
‘తండేల్’ అంటే ‘బోట్ ఆపరేటర్’ అన్నమాట. గుజరాత్ లో ఒక బోట్ ని ఆపరేట్ చేసేవాడిని, అలాగే బోట్ కి కెప్టెన్ గా వ్యవహరించే వాడిని ‘తండేల్’ అని పిలుస్తారట. సుమారుగా మూడు నెలల పాటు గుజరాత్ జాలరులతో గడిపి, వారి నాగరికతని, అలవాట్లని అర్థం చేసుకొని ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట డైరెక్టర్. చూడాలి మరి ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలుస్తుందా లేదా అనేది.