Ram Charan : సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన చిరంజీవి స్వయంకృషి తో ఇండస్ట్రీ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ గా ఎదిగిన తీరు ప్రతీ ఒక్కరికీ ఎంతో ఆదర్శం. తాను మెగాస్టార్ ని అయ్యాను, ఇంట్లో తన తమ్ముళ్లను, పిల్లలను బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ లాగ ఆయన పెంచలేదు. వాళ్లకి చిన్నతనం నుండే కష్టం విలువ చూపించి పెంచాడు.

అందుకే నేడు ఆ కుటుంబం నుండి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఎంతో ఉన్నతమైన స్థానం లో ఉన్నారు. ఇదంతా చిరంజీవి పెంపకం అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మొదటి నుండి కష్టం విలువ ఏంటో చూపించి పెంచాడు. అన్నయ్య బాటలో అడుగులు వేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ నేడు ఏ స్థానం లో ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. అలాగే ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కూడా అలాగే పెంచాడు.

గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవి రామ్ చరణ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ‘చిరుత సినిమా షూటింగ్ సమయం లో ఒక చిన్న ఐల్యాండ్ లో షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఒకరోజు నేను సురేఖ రామ్ చరణ్ ని చూసేందుకు అక్కడికి వెళ్ళాము. చరణ్ అక్కడ ఎండ కి మండిపోయి బాగా ట్యాన్ అయిపోయి ఉన్నాడు. సురేఖ వాడిని చూసి అయ్యో నా బిడ్డ ఇలా అయిపోయాడేంటి అని బాధ పడింది. కానీ నేను మాత్రం వాడిని అలా చూసి చాలా సంబరపడిపోయాను. నా బిడ్డ కూడా క్రింద స్థాయి నుండి వచ్చేవాడిలాగా కష్టపడుతున్నాడు అనుకోని శభాష్ అని చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. ఈ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. రామ్ చరణ్ లో ఉన్న ఆ కష్టపడే తత్వమే నేడు ఆయన్ని తండ్రిని మించిన తనయుడిని చేసింది, గ్లోబల్ స్టార్ గా నిలిచేలా చేసింది.
