ఓరి దేవుడో.. Shaakuntalam సినిమా కోసం అన్ని కోట్ల బంగారాన్ని వాడారా?Shaakuntalam టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత మాయోసైటీస్ నుంచి కోలుకున్నాక ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజిగా ఉంది.. యశోద సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు శాకుంతలం సినిమాతో పాటు విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాను చేస్తున్నాడు.. శాకుంతలం సినిమాను ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ తెరకెక్కుతోంది. ఈ సినిమాను సోషియో ఫాంటసీగా తెరకెక్కించారు గుణశేఖర్. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’..

Shaakuntalam
Shaakuntalam

ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా తెరకెక్కించే గుణ శేఖర్ మరోసారి ‘శాకుంతలం’ వంటి విజువల్ వండర్‌తో పాన్ ఇండియా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయటానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అయితే ఈ సినిమా కథను రియాలిటీ తో తెరకేక్కిస్తున్నారు.. రాజులు నిజంగా ఎలా ఉంటారో అలా వేష దారణ ఉండేలా సినిమాను రూపందిస్తున్నారు.. ప్రతి వస్తువును బంగారంతో చేయించారని తెలుస్తుంది.. ఈ సినిమా కోసం నిజమైన బంగారు నగల్ని వాడారని సమాచారం..అయితే ఈ మూవీ కోసం సుమారు 14 కోట్ల రూపాయల విలువ చేసే నిజమైన బంగారు ఆభరణాలు ఉపయోగించమని డైరెక్టర్‌ గుణశేఖర్ తెలిపారు.

samantha

సుమారు 6 నుంచి 7 నెలలు శ్రమించి ఆభరణాలను తాయారు చేశారట. అలాగే సమంత పాత్ర కోసం 15 కిలోల బంగారంతో సుమారు 14 రకాల ఆభరణాలను తయారు చేశారట. దుష్యంత మహారాజు పాత్ర కోసం 8 నుంచి 10 కిలోల బంగారం, మేనక పాత్రధారి మధుబాల కోసం 6 కోట్లతో వజ్రాలు పొదిగిన దుస్తులను రూపొందించినట్లు గుణశేఖర్ తెలిపారు.. ఈ సినిమా కథ కూడా జనాలకు బాగా నచ్చుతుందని తెలిపారు.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా సమంత లుక్ అందరిని తెగ ఆకట్టుకుంది.. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ టాక్ ను అందుకుంటుందో చూడాలి..