ఇండస్ట్రీలో కొంతమంది కలిసి రాక ఏళ్లపాటు పరిశ్రమకు దూరంగా ఉంటారు. అందుకు తెరమీద లేదా తెర వెనుక జరిగే కొన్ని సంఘటనలే కారణం అవుతాయి. ఇలాంటి సంఘటనలు ఇలియానా జీవితంలో కూడా జరిగాయి.. సౌత్ లో ఒక స్టార్ హీరోయిన్గా వెలుగు వెలుగుతున్న సమయంలో ఈమె బాలీవుడ్‌కు వెళ్ళిపోయింది అంటూ ఈమెపై రకరకాలుగా వార్తలు సృష్టించారు. కానీ ఇప్పుడు అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
దేవదాసు సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన ఈమె పోకిరి సినిమాతో తన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. సౌత్ లో కోటి రూపాయల పారిపోషకం తీసుకున్న హీరోయిన్ కూడా ఈమె. మరొకవైపు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది అక్కడ కూడా అన్ని సూపర్ హిట్ విజయం సాధించాయి. కానీ ఈమె అనుకున్నంత స్థాయిలో బాలీవుడ్ లో రాణించలేదు. ఇటు సౌత్ లో కూడా కనిపించలేదు. కానీ దానికి అసలు కారణం ఓ స్టార్ ఆమెను దారుణంగా కొట్టాడుట. అదీ కూడా సెట్లో అందరి ముందు.
ఓ స్టార్ టాలీవుడ్ హీరో, అప్పుడే వచ్చిన దర్శకుడు, బడా నిర్మాత కాంబోలో ఓ విజయవంతమైన సినిమా రూపొందింది. ఆ చిత్రం షూటింగ్ కు ఇలియానా చాలా లేట్ గా వెళ్ళేదట. యూనిట్ సభ్యులతో కూడా దురుసుగా ప్రవర్తించేదట. ఈ క్రమంలో ఆ చిత్రంలో నటిస్తున్న హీరో.. ఇలియానా చెంప పై ఒక్కటిచ్చాడట. దర్శకనిర్మాతలను, ఇంతమంది యూనిట్ సభ్యులను ఇన్నేసి గంటలు వెయిట్ చేయించడం సరైన పద్ధతి కాదు.. అంటూ ఆమెను మందలించాడట. దీంతో ఇలియానా ఆ సినిమా షూటింగ్ కు వారం రోజుల పాటు వెళ్లలేదట. తర్వాత నిర్మాత స్వయంగా వెళ్లి రిక్వెస్ట్ చేయడంతో షూటింగ్లో జాయిన్ అయ్యిందట.