మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘ Waltair Veerayya ‘ సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. చిరంజీవి మార్కెట్ బాగా పడిపోయింది అని ట్రేడ్ కూడా అనుకుంటున్న సమయంలో బౌన్స్ బ్యాక్ అయ్యి, తన సత్తా ఏమిటో చూపించి ఇప్పటికీ తనకి ఎవ్వరూ పోటీ లేరు అని నిరూపించుకున్నాడు.మరో రెండు రోజుల్లో 50 రోజులు పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్న ఈ సినిమాని లేటెస్ట్ గా మూడు రోజుల క్రితం ప్రముఖ ఓటీటీ ఛానల్ లో విడుదల చేసారు.థియేటర్స్ లో ఎంత రెస్పాన్స్ అయితే వచ్చిందో, ఓటీటీ లో కూడా అదే రేంజ్ సెన్సేషన్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.అప్లోడ్ చేసిన వెంటనే ట్రెండింగ్ లోకి రాకపోయినప్పటికీ పక్క రోజు నుండి ఈ సినిమా టాప్ 1 లో ట్రెండ్ అవ్వడం ప్రారంభించింది.

ఎప్పుడైతే ట్రెండింగ్ లోకి వచ్చిందో, అప్పటి నుండి ‘వాల్తేరు వీరయ్య’ ప్రభంజనం మొదలైంది.నెట్ ఫ్లిక్స్ సంస్థ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఏకంగా 16 దేశాల్లో ట్రెండింగ్ అవుతుందట.ఇండియా తో పాటుగా బాంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇండోనేషియా, ఒమెన్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఇక్కడైతో ఆగదని చెప్తున్నారు విశ్లేషకులు.

ఈ సినిమా మిగిలిన దేశాలలో ఎలా ట్రెండ్ అవుతుందో క్రింద మేము పెట్టిన ఫోటోల ద్వారా చూడొచ్చు. ఇంత తక్కువ సమయం లో #RRR సినిమా కూడా ఈ రేంజ్ లో ట్రెండ్ అవ్వలేదని అంటున్నారు నెట్ ఫ్లిక్స్ సంస్థ. #RRR సినిమా సుమారుగా 20 వారాలకు పైగా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూనే ఉండేది. మరి ‘వాల్తేరు వీరయ్య‘ సినిమా కూడా అలా ట్రెండ్ అయ్యి #RRR మూవీ రికార్డుని కొడుతుందా లేదా అనేది చూడాలి.
