Vyooham Movie : ఎదుటి వారి మనోభావాలను లెక్క చెయ్యకుండా, తనకి తోచినట్టు ఉంటూ నచ్చింది చేస్తూ, నోటికి వచ్చింది మాట్లాడి పిచ్చోడు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చేత అనిపించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు తన దర్శకత్వ ప్రతిభ తో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఏలిన లెజెండ్ గా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు కేవలం వివాదాలతోనే సావాసం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

అందుకే ఇతని మాటలను, ఇతను తీసే సినిమాలను పూర్తిగా పట్టించుకోవడం మానేశారు జనాలు. రీసెంట్ గా ఈయన ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఆధారంగా తీసుకొని, జగన్ , పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు పాత్రలతో ‘వ్యూహం’ అనే సినిమా తీసాడు. ఈ చిత్రం లో జగన్ ని హీరో గా చూపించే ప్రయత్నం చేసాడు. ఇందుకు వైసీపీ పార్టీ సహకారం కూడా ఉంది.

ఈ దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేద్దాం అనుకున్నారు. నేడు సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోవడానికి సిద్దమైన ఈ సినిమాకి, సెన్సార్ బోర్డు వారు నిషేధం విధించారు. ఎందుకంటే ఈ సినిమాలోని పాత్రలు, పాత్రల పేర్లు నిజ జీవితం లో ఉన్నవారిని ఆధారంగా చేసుకొని తీసినవి గా పరిగణించారు.

పవన్ కళ్యాణ్, చంద్ర బాబు నాయుడు, మరియు జగన్ ఇలా నేరుగా నిజ జీవితం లో ఉన్న వాళ్ళ పేర్లను, వారి అనుమతి లేకుండా తీసుకోవడం సెన్సార్ రూల్స్ కి పూర్తిగా విరుద్ధం. అందుకే ఈ చిత్రం పై నిషేధం విధించారు. మరి రామ్ గోపాల్ వర్మ మార్పులు చేర్పులు చేసి మళ్ళీ సెన్సార్ చేయించి విడుదల చేయిస్తారా, లేదా నేరుగా రామ్ గోపాల్ గోపాల్ వర్మ యూట్యూబ్ ఛానల్, లేదా ఓటీటీ లో విడుదల చేయిస్తారా అనేది చూడాలి.