Das ka Dhamki Trailer Review : డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.. విశ్వక్ సేన్ ఇప్పటివరకు చేసిన సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుంది.. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు..ఈ చిత్రానికి విశ్వక్ కథానాయకుడు, దర్శకుడు నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అలాగే ‘దాస్ కా ధమ్కీ’ 1.0 ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది..

సినిమాకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో మరింత జోరు పెంచారు. దాస్ కా ధమ్కీ’ 2.0 ట్రైలర్ ని మార్చి 12న కరీంనగర్ లోని మార్క్ఫెడ్ గ్రౌండ్, రామ్ నగర్ లో జరిగే ఈవెంట్ లో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ విశ్వక్ సేన్ క్లాస్, మాస్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.. పుట్ పాత్ లను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉండాలి.. అంటూ మొదలైన డైలాగులు మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతాయి.. డబ్బులు వస్తే ఏం చేస్తాడు అన్నది సినిమా కథ అన్నట్లు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది.మొత్తానికి ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది..
ఇకపోతే వన్మయే క్రియేషన్స్ , విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని దినేష్ కె బాబు నిర్వహిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా అన్వర్ అలీ ఎడిటర్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి..
తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: విశ్వక్ సేన్
నిర్మాత: కరాటే రాజు
బ్యానర్లు: వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్
డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ
డీవోపీ: దినేష్ కె బాబు
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటర్: అన్వర్ అలీ
ఆర్ట్ డైరెక్టర్: ఎ.రామాంజనేయులు
ఫైట్స్: టోడర్ లాజరోవ్-జుజి, దినేష్ కె బాబు, వెంకట్
పీఆర్వో: వంశీ శేఖర్