virupaksha first day collections : సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.విడుదలకు ముందు నుండే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ని ఆకట్టుకుంది కానీ, ఎందుకో కావాల్సిన హైప్ రాలేదు.అందువల్ల మార్నింగ్ షోస్ ఆక్యుపెన్సీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా లేవు.
కానీ మాట్నీస్ నుండి ఈ సినిమా దంచి కొట్టేసింది.ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడిపోయింది.కంటెంట్ కి ఉన్న పవర్ ఎలాంటిదో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసింది ఈ చిత్రం.అలా షో కి వేరే లెవెల్ ఆక్యుపెన్సీలు పెంచుకుంటూ పోయిన ఈ చిత్రానికి మొదటిరోజు ఎవ్వరూ ఊహించని ఓపెనింగ్ వచ్చింది.ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి నాలుగు కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. వాస్తవానికి ట్రేడ్ నిన్న నాలుగు కోట్ల రూపాయిల షేర్ వస్తుందని అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాలను దాటి ఈ సినిమా మరో 70 లక్షల రూపాయిలు అదనంగా రాబట్టింది. అందులో కోటి 86 లక్షల రూపాయిలు నైజాం ప్రాంతం నుండి రాబట్టింది.ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ అని అంటున్నారు.
అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం లో 58 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా రాయలసీమ ప్రాంతం లో 54 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 40 లక్షలు, వెస్ట్ గోదావరి లో 47 లక్షలు, గుంటూరు జిల్లాలో 46 లక్షలు , కృష్ణ జిల్లాలో 32 లక్షలు మరియు నెల్లూరు లో 20 లక్షలు వసూలు చేసింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 4.70 కోట్లు, అలాగే ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 22 కోట్ల రూపాయిలు రావాలి. వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.