Virupaksha: ఈమధ్యనే విడుదలైన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుందో మనం చూస్తూనే ఉన్నాము.ఈ చిత్రం వసూళ్లు ట్రేడ్ పండితులు సైతం ఊహించని విధంగా వస్తున్నాయి. వీకెండ్స్ లో సినిమాలు బాగా ఆడడం సర్వసాధరణం, కానీ వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రం అనకాపల్లి నుండి అమెరికా వరకు స్టడీ కలెక్షన్స్ ని రాబడుతుంది అంటే , మంచి కంటెంట్ ని మన ఆడియన్స్ ఏ రేంజ్ లో తీసుకెళ్లారో అర్థం చేసుకోవచ్చు.
కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమా ఆరు రోజుల్లో పాతిక కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఒకప్పుడు ఇది సాయి ధరమ్ తేజ్ సినిమాలకు క్లోసింగ్ నెంబర్, అలాంటిది ఇప్పుడు మొదటి వారం లోనే వచ్చిందంటే ఈ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ సినిమా ఓవర్సీస్ పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి, చాలామంది ఓవర్సీస్ మార్కెట్ అంటే కేవలం వీకెండ్ మార్కెట్ అని అంటూ ఉంటారు. అంటే కేవలం మొదటి వీకెండ్ మాత్రమే వసూళ్లు వస్తాయని, ఆ తర్వాత నుండి కలెక్షన్స్ రావని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. కానీ ఈ సినిమా విషయం లో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.సోమవారం నాడు మొదటి రోజు కి ముందు పడిన ప్రీమియర్ షోస్ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయట.
ఇలా ఇది వరకు ఏ మీడియం రేంజ్ హీరో సినిమా విషయం లో జరగలేదట.ఇక రేపు ఏజెంట్ సినిమా విడుదల అవుతున్నప్పటికీ, విరూపాక్ష కి వస్తున్న సెన్సేషనల్ రెస్పాన్స్ ని చూసి థియేటర్స్ మరియు షోస్ భారీ గా పెంచేసారట. ఒక పెద్ద సినిమా విడుదల సమయం లో వారం క్రితం విడుదలైన సినిమాకి షోస్ పెంచడం అనేది మామూలు విషయం కాదు.ఇప్పటి వరకు 1 మిలియన్ డాలర్ మార్కుని దాటిన ఈ చిత్రం ఫుల్ రన్ లో మరో 5 లక్షల డాలర్స్ వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.