Virupaksha Review : ఈ ఏడాది సమ్మర్ మొత్తం చప్పగా సాగిపోయింది.కేవలం ‘దసరా’ అనే చిత్రం మినహా మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.’దసరా’ చిత్రం కూడా కేవలం తెలంగాణ మరియు ఓవర్సీస్ లోనే పెద్ద హిట్ అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లో యావరేజి గానే నిలిచింది. సమ్మర్ మొత్తం మీద విడుదలైన పెద్ద సినిమా ఇదే, ఈ చిత్రం రన్ కూడా దాదాపుగా క్లోజ్ అయిపోయింది.
ఇప్పుడు అందరి చూపు సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం మీదనే ఉంది. టీజర్ మరియు ట్రైలర్ దగ్గర నుండే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చిన ఈ సినిమా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అయ్యింది.విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఈ చిత్రం ఏర్పర్చిన అంచనాలను విడుదల తర్వాత అందుకుందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

కథ :
రాష్ట్రం లో ఉండే ఆసక్తికరమైన పల్లెటూర్లను సందర్శించే అలవాటు ఉండే హీరో ( సాయి ధరమ్ తేజ్) కి ఒకసారి రుద్రవణం అనే పల్లెటూరికి తన స్నేహితుడితో కలిసి వెళ్తాడు.ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండే ఆ ఊరుని, అక్కడి సంప్రదాయాలను ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు హీరో.ఇదే సమయం లో అతనికి హీరోయిన్ పరిచయం అవుతుంది.ఆమెని ఆటపట్టిస్తూ సరదాగా ఉంటూ తన ప్రేమలోకి దింపుతాడు.అలా సాఫీగా సాగిపోతున్న సమయం లో ఊర్లో హత్యలు జరగడం ప్రారంభం అవుతుంది.అనుమానాస్పదం గా ఎవరో చాతబడి చేస్తూ ఊర్లో ఉన్నవాలందరిని చంపేస్తున్నారని అందరూ భయపడుతూ ఉంటారు.హీరో ఈ హత్యలన్నిటికి కారణం ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.ఈ క్రమం లో ఆయనకీ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టు ఎదురు అవుతుంది.ఆ ట్విస్ట్ ఏమిటి అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ :
ఇటీవల కాలం లో ఇంతటి హారర్ జానర్ లో వచ్చిన సినిమా మరొకటి లేదు.ఈ చిత్రం లోని చాలా సన్నివేశాలు మన రోమాల్ని నిక్కపొడుచుకునేలా చేస్తాయి.డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం ఉన్న థియేటర్ లో ఈ చిత్రాన్ని చూస్తే ఆ అనుభూతిని అంత తేలికగా ఇప్పట్లో మర్చిపోలేరు.అంత గ్రిప్పింగ్ గా ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడు డైరెక్టర్ కార్తీక్ దండు.క్రియేటివ్ క్రియేటివ్ సుకుమార్ శిష్యుడిగా ఈ సినిమా ద్వారా పరిచయమైనా కార్తీక్ దండు.గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు.ఈ సినిమాకి కథ మరియు దర్శకత్వం కార్తీక్ దండుది కాగా స్క్రీన్ ప్లే మాత్రం సుకుమార్ అందించాడు.ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమా లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చిన్న పిల్లల్ని కూడా ఎంజాయ్ చేసేలా చేస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ అద్భుతంగా చేసాడనే చెప్పాలి.థ్రిల్లింగ్ జానర్ సినిమాలకు చాలా మంది హీరోలు పనికిరారు.ఎందుకంటే ముఖం లో ఎల్లప్పుడూ తర్వాత ఏమి జరగబోతుంది అనే టెన్షన్ ని చూపించలేరు.అలా చూపించడం చాలా కష్టం,కానీ సాయి ధరమ్ తేజ్ చాలా అలవోకగా ఈ పాత్రని చేసేసాడు.ఈ చిత్రం ఆయనకీ బెస్ట్ కం బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు.ఇక హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి, ఈమె ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించేసింది.ముఖ్యంగా ఈమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ కి థియేటర్స్ లో ఆడియన్స్ సీట్స్ మీద లేచి నిల్చుంటారు.అంతలా షాక్ కి గురి చేస్తుంది ఆ ట్విస్ట్.ఇంతకీ ఏమిటి ఆ ట్విస్ట్ అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి.ఇక గ్రామా పెద్దగా సునీల్ కూడా ఎంతో చక్కగా ఇందులో నటించాడు, టెక్నికల్ గా సినిమా చాలా రిచ్ గా ఉంది,ఇక సంగీత దర్శకుడు అంజనీష్ లోకనాథ్ నేపధ్య సంగీతం చిత్రానికి ఆయువు పట్టులాగా నిలిచింది.ఈ సినిమాకి సంగీతమే ప్రాణం.
చివరి మాట :
థ్రిల్లర్ జానర్ మూవీ లవర్స్ కి కనుల పండుగలాగా ఉండే సినిమా ఇది..తప్పక థియేట్రికల్ అనుభూతిని మిస్ కాకండి.
నటీనటులు :
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, సునీల్, అజయ్, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ తదితరులు
డైరెక్టర్ : కార్తీక్ దండు
సంగీతం : అంజనీష్ లోకనాథ్
నిర్మాత : BVSN ప్రసాద్
రేటింగ్ : 3/5.