Vijayashanti : ఏ ఇండస్ట్రీ లో అయినా హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీ ని శాసించే స్థాయిలో ఉంటారు. వాళ్ళు చెప్పినట్టుగానే డైరెక్టర్లు మరియు నిర్మాతలు నడుచుకోవాలి. అలాంటి మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ హీరోయిన్స్ స్టార్ స్టేటస్ ని దక్కించుకొని హీరోలకు ధీటుగా పోరాడడం అనేది ఆషామాషీ విషయం ఏమి కాదు.
అలా చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున,వెంకటేష్ వంటి లెజెండ్స్ ఇండస్ట్రీ ని ఏలుతున్న సమయం లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి వాళ్లకి ధీటుగా సమానమైన స్టార్ స్టేటస్ ని దక్కించుకొని లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరు తెచ్చుకుంది. అప్పట్లో ఈమె సినిమా వస్తుంది అంటే మాస్ ఆడియన్స్ చొక్కాలు చింపుకొనిమరీ క్యూ లైన్స్ లో నిల్చునే వారు. అప్పట్లోనే కోటి రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక నటిగా చరిత్ర సృష్టించింది. ఈమె అప్పట్లో దాదాపుగా తెలుగు మరియు తమిళ భాషల్లో అందరూ స్టార్ హీరోల సరసన నటించింది.
కానీ అత్యధికంగా ఆమె చిరంజీవి బాలకృష్ణ తోనే చేసింది. సినిమాల్లో ఆ రేంజ్ పీక్ ని ఎంజయ్ చేస్తున్న సమయం లోనే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమం నరనరాల్లో నింపుకున్న విజయ శాంతి అనుక్షణం ప్రజల కోసం పోరాడుతూ ఉండేది. అప్పట్లో తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో మన అందరికీ తెలిసిందే.
ఆ టైం లో నేను పని చేసిన హీరోలు ఒక్కరు కూడా మద్దతుగా మాకు నిలబడలేదు అని చెప్పుకొచ్చింది. ఇక్కడి ప్రేక్షకుల అశేష ఆదరణ దక్కించుకున్న చిరంజీవి, బాలకృష్ణ వంటి వాళ్ళు కూడా ప్రజల గొంతుకగా నిలబడకపోవడం దురదృష్టకరం. ఇలాంటి హీరోలతో కలిసి ఇన్ని సినిమాలు చేసినందుకు సిగ్గు పడుతున్నాను అంటూ కొద్దీ నెలల క్రితం జరిగిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపాయి.