Vijaya Shanthi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ సక్సెసఫుల్ కాంబినేషన్స్ లో ఒకటి నందమూరి బాలకృష్ణ – Vijaya Shanthi . వీళ్లిద్దరు కలిసి సుమారుగా 17 సినిమాల్లో కలిసి నటిస్తే వారిలో పదికి పైగా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా సహజం గా ఉంటుంది, అందుకే ఆరోజుల్లో వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అంటూ , త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ రూమర్స్ బలంగా వినిపించేవి.

చాలామంది అది రూమర్స్ కాదు నిజమే అని నమ్మే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు, ఆ రూమర్స్ నిజమో కాదో తెలియదు కానీ వీళ్లిద్దరు మాత్రం మంచి స్నేహితులు అనే చెప్పాలి. అప్పట్లో బాలయ్య తో పాటుగా చిరంజీవి తో కూడా ఈమె ఎక్కువ సినిమాలు చేసింది. బాలయ్య తో కలిసి 17 సినిమాల్లో నటిస్తే చిరంజీవి తో కలిసి 19 సినిమాల్లో నటించింది, కానీ బాలయ్య మీదనే ఆమె ఎక్కువ అభిమానం చూపించేది. ఆయనతో కలిసి ఒక సినిమాని కూడా నిర్మించింది, ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

ప్రముఖ దర్శకుడు కోదండరామి రెడ్డి తో బాలయ్య బాబు చేసిన ‘నిప్పు రవ్వ’ అనే సినిమాని స్వయంగా విజయశాంతి నిర్మించింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు కానీ, ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ పరంగా యావరేజి అని అనిపించుకుంది. ఈ సినిమా విడుదల రోజే బాలయ్య బాబు హీరో గా నటించిన ‘బంగారు బుల్లోడు’ సినిమా కూడా విడుదలైంది.
ఆ సినిమాలో పాటలు బాగుంటాయి, కమర్షియల్ గా ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పొందగల అన్ని ఎలిమెంట్స్ అందులో ఉన్నాయి.అందుకే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది , దాని ప్రభావం ఈ చిత్రం కూడా పడింది, ఫలితంగా కలెక్షన్స్ పెద్దగా రాలేదు. ఈ సినిమాకి నిర్మాతగా బాధ్యతలన్నీ విజయశాంతి చేపట్టినప్పటికీ స్క్రీన్ మీద తన పేరు కాకుండ తన భర్త పేరు MV శ్రీనివాస్ ప్రసాద్ పేరునే వేసుకుంది.. ఈ సినిమా తర్వాత విజయశాంతి మళ్ళీ నిర్మాణ రంగం వైపు చూడలేదు.