Vijay Thalapathy : తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి అందరికి తెలిసిందే..తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరోనే..తాజాగా విజయ్ వారసుడు సినిమాతో యావరేజ్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం లేదు.హీరో సినిమాలు హిట్ అవ్వకున్నా కూడా రెమ్యునరేషన్ కూడా బాగానే అందుకుంటారు అన్న విషయం తెలిసిందే..కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నికర ఆస్తుల విలువ 445 కోట్ల రూపాయలు అని సమాచారం. ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని విజయ్ పారితోషికంగా అందుకుంటున్నారు. తమిళనాడులో ప్రస్తుతం విజయ్ నంబర్ వన్ హీరోగా ఉన్నారు.
విజయ్ సినిమా సినిమాకు రెమ్యునరేషన్ ను అంతకంతకూ పెంచుతుండటంతో రాబోయే రోజుల్లో రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. సౌత్ ఇండియాలోనే భారీగా రెమ్యునరేషన్ ను అందుకుంటున్న హీరోలలో విజయ్ ఒకరిగా నిలిచారు. విజయ్ తెలుగు హీరోలతో కలిసి మల్టీస్టారర్స్ లో నటిస్తే బాగుంటుందని కొంతమంది సూచనలు ఇస్తున్నారు..మరి నిజంగా విజయ్ కు ఆ ఆలోచన ఉందేమో చూడాలి..తనపై వస్తున్న రుమెర్స్ పై అతను ఎక్కువగా స్పందించడు..
విజయ్ వరుసగా ప్రాజెక్ట్ లలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తలను విజయ్ ఎక్కువగా పట్టించుకోవడం లేదు.ఇతర స్టార్ హీరోలకు సైతం విజయ్ గట్టి పోటీ ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎంత ఎదిగినా విజయ్ ఒదిగి ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలుగు రీమేక్ సినిమాలలో నటించి విజయ్ తమిళనాడులో క్రేజ్ ను మరింత పెంచుకున్నారు..సరికొత్త కథలను ఎంపిక చేసుకుంటూ వరుస సినిమాలతో బిజిగా ఉన్నాడు..ఎటువంటి పాత్రలు చేసిన ఆయన మార్క్ తగ్గలేదు..మరింత పెరుగుతుంది..