Getup Srinu : గెటప్ శ్రీను సినిమా టీజర్ ను చూశారా? ఫస్ట్ మూవీలోనే లిప్ లాక్ లు..

- Advertisement -

Getup Srinu : జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ఫెమస్ అయ్యారు.. కొంతమంది మాత్రం సినిమాల్లో నటిస్తూ బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు..మరి కొంతమంది మాత్రం..హీరోగా అవకాశాలను అందుకుంటున్నారు.. అందులో గెటప్ శీను కూడా ఒకరు..కేవలం కామెడీలోనే కాదు.. ఆయన వేసే ప్రతి గెటప్‏లోనూ ఒదిగిపోయి ప్రేక్షకులను అలరిస్తారు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా పలు చిత్రాల్లో కనిపించారు గెటప్ శ్రీను. జాంబీరెడ్డి సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇన్నాళ్లు కమెడియన్‏గా కనిపించిన శ్రీను.. ఇప్పుడు హీరోగా మారారు.

Getup Srinu
Getup Srinu

ఆయన ప్రధాన పాత్రలో సాయి వరుణవి క్రియేషన్స్ బ్యా నర్ పై రూపొందిన చిత్రం రాజుయాదవ్.. సూడో హీరోయిజం జోనర్ లో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ తో కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో వున్న రాజు యాదవ్ టీజర్ ని సంక్రాంతి కానుకగా ఈ రోజు విడుదల చేశారు మేకర్స్..బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను తనలో వున్న కంప్లీట్ యాక్టర్ ని ఆవిష్కరించేలా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. టీజర్ లో గెటప్ శ్రీను నటన అవుట్ స్టాండింగ్ గా ఉంది.

comedian srinu
comedian srinu

ఏం జరిగినా.. లైఫ్ లాంగ్ స్మైల్ ఫేస్ తో గడపాల్సి వస్తే ఎలా వుంటుంది అనే పాయింట్ చాలా ఆసక్తికరంగా ఎక్సయిటింగా వుంది..హీరోయిన్ కూడా బాగానే అలరించింది..గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించడంలో భాగమైన ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ ఈ చిత్రంలో రెండూ పాటలు రాయడం, అలాగే రాహుల్ సింప్లీగంజ్ ఓ పాట పాడటం మరో ప్రధాన ఆకర్షణ. మరో రెండు పాటలకు కాసర్ల శ్యాం సాహిత్యం అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చిలో సినిమాను విడుదల చేసెందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది..ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here