శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రేమ కథ చిత్రంగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ అండ్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో మూవీ టీం.. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా విజయ్ తమిళనాడు ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు.

నిన్న ఉదయం కోయంబత్తూరులోని ఒక కాలేజీలో స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయిన విజయ్.. తాజాగా చెన్నైలో ఒక ప్రెస్ మీట్ లో పాల్గొనున్నాడు. ఈ మీడియా ఇంటరాక్షన్ లో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ వచ్చాడు. ఈక్రమంలోనే ఒక రిపోర్టర్ విజయ్‌ని.. “రష్మికతో కలిసి మీరు మళ్ళీ ఎప్పుడు సినిమా చేయబోతున్నారు” అని ప్రశ్నించారు. విజయ్ బదులిస్తూ.. “మీ దగ్గర స్క్రిప్ట్ ఉంటే చెప్పండి చేస్తాను. నేను ఒక మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్నాను. ఒక బెస్ట్ స్టోరీ దొరికితే తనతో కలిసి మళ్ళీ వర్క్ చేయాలనీ అనుకుంటాను. గుడ్ స్క్రిప్ట్ వస్తే ఆమెను నా సినిమాలో ఎంపిక చేసుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను” అంటూ బదులిచ్చాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండడంతో మరోసారి వీరిద్దరి ప్రేమ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఇదే కార్యక్రమంలో రిపోర్టర్స్ ప్రశ్నిస్తూ.. “ఖుషి అని విజయ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ పెట్టారు. ఆ మూవీ కథకి దీనికి ఏమన్నా పోలికి ఉందా?” అని అడిగారు. విజయ్ బదులిస్తూ.. “తమిళంలో విజయ్ సార్, తెలుగులో పవన్ సార్ చేసిన ఖుషి సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ కథకి, ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు. మా కథకి కూడా ఆ టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందని పెట్టాము. విజయ్ సార్ ఖుషి ఎలా ఎంజాయ్ చేసినట్లే, ఖుషి కూడా ఎంజాయ్ చేస్తారు” అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు.