Vijay Sethupathi : ప్రస్తుతం సీనియర్, జూనియర్ ఏ హీరోలైన తమ సినిమాలో కచ్చితంగా యంగ్ హీరోయిన్స్ ఉండాలని కోరుకుంటారు. ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలోనైనా సరే వయసుతో సంబంధంల లేకుండా సీనియర్ హీరోల పక్కన కుర్ర హీరోయిన్లు నటిస్తున్నారు. అంతేకాకుండా వారికంటే వయసులో చిన్న వాళ్లు… దాదాపు కూతురు వయసున్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. అయితే, ఇలాంటి వాటికి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నారు వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి. దేశంలో ప్రస్తుతం ఈయన పేరు ఎంతలా మార్మోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ కావడంతో తన క్రేజ్ రోజురోజుకు అమాంతం పెరిగిపోతుంది. అలాంటి విజయ్ సేతుపతికి ఒక యంగ్ హీరోయిన్ తో రొమాన్స్ చేసే అవకాశం వస్తే రిజెక్ట్ చేశారట. ఆమె మరెవరో కాదు ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కృతి శెట్టి. ఆ సినిమాలో విజయ్ సేతుపతి కృతిశెట్టికి తండ్రిగా నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా తర్వాత ఆయనకు తమిళంలో ఒక సినిమాలో హీరోగా అవకాశం వచ్చిందట. ఈ చిత్ర బృందం కృతిశెట్టిని ఇందులో హీరోయిన్ గా ఎంచుకున్నారట. అయితే విషయం విజయ్ సేతుపతికి తెలియడంతో కృతి శెట్టి ఫోటో చూడగానే ఆ అమ్మాయికి నేను తండ్రిగా చేశాను.. నాకు కూతురు లాంటిది తనతో ఎలా రొమాన్స్ చేయగలను.. ఆడియన్స్ దీన్ని యాక్సెప్ట్ చేయరంటూ మెహమాటం లేకుండా నో అన్నారట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. వాస్తవానికి ఉప్పెన క్లైమాక్స్ సీన్ చేసే టైంలో కృతి శెట్టి చాలా ఇబ్బంది పడిందట… అప్పుడు విజయ్ తనకు ధైర్యం చెప్పాడట. నాకు నీ వయసున్న కొడుకు ఉన్నాడు.. నువ్వు నా కూతురు లాంటివే.. కాబట్టి నన్ను మీ ఫాదర్ అనుకుని నటించని చెప్పారట. అలా చెప్పిన తర్వాత కూడా తనతో రొమాన్స్ చేయలేనని ఆఫర్ రిజెక్ట్ చేశారట.
