Krithi Shetty : కొన్ని కాంబినేషన్స్ అసలు వర్కవుట్ అవ్వవు. అలాంటి వాటిలో విజయ్ సేతుపతి, కృతి శెట్టి కాంబినేషన్ కూడా ఒకటి. ఇప్పటికే విజయ్ సేతుపతి హీరోగా నటించిన పలు సినిమాల్లో కృతికి హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. కానీ విజయే స్వయంగా తనకు జోడీగా కృతి వద్దని స్పష్టం చేశాడట.

దాని వెనుక ఆయనకు ఒక కారణం కూడా ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అసలు ఆ కారణం ఏంటి అని ప్రేక్షకులు గెస్ చేయడం మొదలుపెట్టారు. ఉప్పెనలో కృతి శెట్టికి తండ్రి పాత్రలో నటించాను కాబట్టి తనతో హీరోగా రొమాన్స్ చేయడం తనకు ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చాడు విజయ్ సేతుపతి. ఇప్పటికీ కృతిని తన కూతురిలాగానే చూస్తానని అన్నాడు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘లాభం’ చిత్రంలో కృతిని హీరోయిన్‌గా అనుకున్నా కూడా ముందు తండ్రిగా నటించి, ఆ తర్వాత హీరోహీరోయిన్‌గా నటించడం తనకు ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం కృతి శెట్టి.. సూర్యతో నటిస్తున్న చిత్రంతో తమిళ డెబ్యూకు సిద్ధమయ్యింది. మామూలుగా హీరోలు.. హీరోయిన్స్ విషయంలో ఇలాంటి కారణాలు పట్టించుకోరని, కానీ విజయ్ సేతుపతి మాత్రం ఒకప్పుడు తండ్రిగా నటించినందుకు ఇంకా ఆ హీరోయిన్‌ను తన కూతురిగా ఫీల్ అవుతున్నానని చెప్పడం గ్రేట్ అని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.