Vijay Sethupathi : ఇక పై నన్ను అలాంటివి అడగకు.. ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ అల్లు అర్జున్ కి క్లాస్ పీకిన విజయ్ సేతుపతి!

- Advertisement -

Vijay Sethupathi : సౌత్ లో నేటి తరం హీరోలలో విలక్షణమైన నటుల పేర్లు తీస్తే అందులో విజయ్ సేతుపతి కచ్చితంగా ఉంటాడు. ఇతను చెయ్యలేని రోల్ అంటూ ఏది లేదు. హీరో గా కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ మరియు క్లాసిక్స్ ని అందుకున్న విజయ్ సేతుపతి, ఈమధ్య నెగటివ్ రోల్స్ మరియు కీలక పాత్రలు కూడా చేస్తున్నాడు. ఇది ఆయన అభిమానులకు కాస్త ఇబ్బంది కలిగించింది.

Vijay Sethupathi
Vijay Sethupathi

ఎందుకంటే కోలీవుడ్ లో విజయ్ సేతుపతి ఒకప్పుడు సాధించిన విజయాలను చూసి, ఇతను భవిష్యత్తులో కచ్చితంగా అజిత్ రేంజ్ సూపర్ స్టార్ అవుతాడని అనుకున్నారు.కానీ చివరికి ప్రకాష్ రాజ్ లాగ క్యారక్టర్ ఆర్టిస్ట్ అయిపోతున్నాడు. ఇది ఆయన అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. రీసెంట్ గానే ఆయన షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రం లో విలన్ రోల్ చేసాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

Vijay Sethupathi Photos

అయితే రీసెంట్ గా విజయ్ సేతుపతి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో, కొన్ని విషయాలపై కీలక వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ఇక నుండి నేను విలన్ రోల్స్ మరియు క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చెయ్యను. నాలో ఎలాంటి షేడ్స్ ఉన్నాయో జనాలకు చూపించడం కోసమే నేను ఆ పాత్రలు చేశాను. ఇక మీదట అలా చెయ్యాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ సినిమాలో విజయ్ సేతుపతి కి నెగటివ్ రోల్ ఆఫర్ వచ్చింది.

- Advertisement -

కానీ ఆయన డైరెక్టర్ సుకుమార్ కి నేరుగా మొహం మీద ఇక ఇలాంటి పాత్రలు నేను చెయ్యదల్చుకోలేదు, నన్ను అడగకండి అని చెప్పేశాడట. కానీ ఆ పాత్రకు విజయ్ సేతుపతి తప్ప ఎవ్వరూ సూట్ కారు అనేది సుకుమార్ అభిప్రాయం. అందుకే అల్లు అర్జున్ తో కూడా రిక్వెస్ట్ చేయించాడట. కానీ విజయ్ సేతుపతి , నేను అలాంటి పాత్రలు చెయ్యకూడదు అని నిర్ణయం తీసేసుకున్న, ఇక మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి అని అన్నాడట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here