Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కావాలి అన్నది అందరికి తెల్సిందే. గత కొన్నేళ్లుగా విజయ్ మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. గతేడాది ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందివ్వలేకపోయింది. ఇక దీంతో విజయ్ ఆశలన్నీ ది ఫ్యామిలీస్టార్ సినిమాపైనే పెట్టుకున్నాడు. విజయ్ కెరీర్ లో గీతగోవిందం లాంటి హిట్ ను అందించిన పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అదే సినిమాను నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఈ సినిమాలోని మొదటి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నందనందనా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. గీతగోవిందం లో ఇంకేం ఇంకేం కావాలే అంటూ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపిన సిద్ .. మరోసారి నందనందనా తో ఆ మ్యాజిక్ ను క్రియేట్ చేసేటట్లే ఉన్నాడు. ఇక విజయ్- మృణాల్ జంట ఫ్రెష్ గా ఉంది. ఫ్యామిలీ మ్యాన్ లా విజయ్ కనిపించగా.. అతడిని ఇష్టపడే అమ్మాయిగా మృణాల్ కనిపించింది. తనపై ఉన్న ప్రేమను చెప్పి చెప్పనట్టుగా ఒక్క మాటలో చెప్పడంతో విజయ్ తన మనసులోని మనోభవాలను ఇలా సాంగ్ రూపంలో బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఇక విజయ్ హుక్ స్టెప్ అదిరిపోయింది.
జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఆకట్టుకొంటుంది. మృణాల్ ఎప్పటిలానే అందంగా ఉంది. కానీ, గీతగోవిందం మ్యాజిక్ రిపీట్ అవ్వలేదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. విజయ్- మృణాల్ జంట బావుంది కానీ, విజయ్- రష్మిక జోడికి మాత్రం మ్యాచ్ అవ్వలేదని అంటున్నారు. దీనికి కారణం విజయ్ రష్మిక బయట కూడా క్లోజ్ కావడంతో స్క్రీన్ మీద కూడా రొమాన్స్ పండేవి.. మృణాల్ తో విజయ్ కు ఇదిమొదటి సినిమా కావడంతో ఇద్దరూ అంతగా కలిసిపోలేకపోతున్నారని టాక్ వినిపిస్తోంది.