Thalapathy Vijay : దళపతి విజయ్ మూవీలో విజయ్ కాంత్..! ఎలా సాధ్యం..?

- Advertisement -

 Thalapathy Vijay : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దళపతి విజయ్ సినిమాలో స్టార్ హీరో క్యామియో ప్లే చేయబోతున్నాడు అనే వార్త వినిపిస్తోంది. ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో విజయ్ సినిమాలో గెస్ట్ రోల్ చేసే అంత స్టార్ హీరో ఎవరు? అనే డిస్కషన్స్ కోలీవుడ్ లో స్టార్ట్ అయ్యాయి. లేటెస్ట్ గా ఈ క్యామియో చేయనున్న స్టార్ హీరో ఎవరో తెలిసిపోయింది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇందులో ఏజ్డ్ క్యారెక్టర్ 90’ల కాలంలో ఉంటుందట. క్యామియో కూడా ఈ సమయంలో స్టార్ హీరోగా బాక్సాఫీస్ రికార్డులని కొల్లగొట్టిన విజయ్ కాంత్ నే తీసుకోవాలని వెంకట్ ప్రభు భావిస్తున్నాడట. ఇటీవలే కెప్టెన్ విజయకాంత్ ఫ్యామిలీని కలిసి పర్మిషన్ తీసుకున్న వెంకట్ ప్రభు… కెప్టెన్ ని గోట్ సినిమాలో చూపించడానికి రెడీ అవుతున్నాడు. కెప్టెన్ మరణించాడు కాబట్టి పాత సినిమా విజువల్స్ కాకుండా AI టెక్నాలజీని వాడి విజయకాంత్-విజయ్ కలిసున్నట్లు చూపించబోతున్నారట.

ఇలా చేయడం కాస్త బడ్జట్ పెంచే విషయమే కానీ చిరవిసారిగా తమ అభిమాన హీరోని తెరపై చూసుకోవడానికి విజయకాంత్ అభిమానులంతా థియేటర్స్ కి వస్తారు. అయితే చనిపోయిన మనిషిని మళ్లీ తెరపై చూపించడం మనకి కొత్తేమి కాదు. కలిసుందాం రా, యమదొంగ సినిమాల్లో ఎన్టీఆర్ ని చూపించాం కానీ అవి పాత సినిమా విజువల్స్. ఈ విషయంలో ఒక మెట్టు పైకి ఎక్కి గ్రాఫిక్స్ ని వాడి యాక్షన్ కూడా చేయించాడు కోడి రామకృష్ణ. తెలుగు సినిమాలకి గ్రాఫిక్స్ నేర్పించిన కోడి రామకృష్ణ… కన్నడ స్టార్ హీరో విష్ణు వర్ధన్ తో నాగరాహువు అనే సినిమా చేసాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో విష్ణువర్ధన్ చనిపోవడంతో కోడి రామకృష్ణ… గ్రాఫిక్స్ ని వాడి విష్ణువర్ధన్ ని రీక్రియేట్ చేసాడు. ఇప్పుడు టెక్నాలజీ మరింత పెరిగింది కాబట్టి విజయ్ సినిమాలో విజయకాంత్ చాలా రియలిస్టిక్ గా కనిపించే అవకాశం ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here