Rashmika – Vijay Devarakonda : రష్మికకు విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు.. ఎందుకో తెలుసా..

- Advertisement -

Rashmika – Vijay Devarakonda : ప్రస్తుతం పాన్ ఇండియా మొత్తంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది రష్మిక మందన్న మాత్రమే. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది నేషనల్ క్రష్ రష్మిక. పుష్ప 2 సినిమా కూడా రిలీజ్ అయితే రష్మిక క్రేజ్ మరింత పెరగనుంది. పాన్ ఇండియా సినిమాలకి సోలో ఆప్షన్ గా కనిపిస్తున్న రష్మిక… ఫోర్బ్స్ 30లో చోటు దక్కించుకింది.

Rashmika
Rashmika


ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్… వివిధ రంగాల్లో తమదైన ముద్రవేసిన 30 ఏళ్లలోపు యువతీయువకులతో ‘30 అండర్ 30’ లిస్ట్ ని అనౌన్స్ చేసింది. ఈ లిస్టులో ఈ ఏడాది రష్మిక చోటు దక్కించుకుంది. ఫోర్బ్స్ 30పై రష్మిక… సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ… ఫోర్బ్స్ 30 కవర్ పేజ్ ని షేర్ చేసింది. తన జర్నీలో సపోర్ట్ చేస్తూ వచ్చిన అభిమానులకి థాంక్స్ చెప్తూ రష్మిక చేసిన పోస్ట్ పై రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ట్వీట్ చేయడం విశేషం. “నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి’’ అంటూ విజయ్ దేవరకొండ రష్మికని అభినందిస్తూ పోస్ట్ పెట్టాడు.

రష్మిక-విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారు అనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో రష్మిక, విజయ్ దేవరకొండ క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండడంతో రూమర్స్ మరింత ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇద్దరూ కలిసి టూర్స్ కూడా వెళ్తున్నారు కాబట్టి ఈ గీతాగోవిందం జంట ప్రేమలో ఉన్నారు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. మరి త్వరలో ఈ జంట తమ ప్రేమని రివీల్ చేసి… పెళ్లి పీటలు ఎక్కుతారేమో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here