సమంత, విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ ఖుషి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా సక్సెస్ హీరో విజయ్ దేవరకొండకు, హీరోయిన్ సమంతకు ఇద్దరికి అత్యవసరం. అటు శివ నిర్వాణకు కూడా ఈ సక్సెస్ కీలకంగా మారింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన నా రోజా నువ్వే సాంగ్, ఆరాధ్య సాంగ్, టైటిల్స్ సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా విడుదల అయ్యి క్షణాల్లో వైరల్ అయిపొయింది. ఈ సినిమా రిలీజ్ కానున్న నేపధ్యంలో ఇటీవలే “ఖుషి” సినిమాకు ఘనంగా ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, సమంత చాలా హుషారుగా సందడి చేసారు. అయితే.. విజయ్ దేవరకొండ ఈ ఈవెంట్ కోసం వేసుకొచ్చిన కాస్ట్యూమ్ చాలా డిఫరెంట్ గా ఉండి హైలైట్ అయ్యింది.
వైట్ అండ్ వైట్ లో మెరిసిపోయిన విజయ్ దేవరకొండ సమంత తో కలిసి స్టెప్పులేశాడు. ఇదంతా ఒకెత్తయితే, విజయ్ ధరించిన ఔట్‌ఫిట్ మరో ఎత్తు ఐయ్యింది.వైట్ కలర్ కోట్, పలోజా మోడల్ ప్యాంట్ తో విజయ్ చాలా డిఫరెంట్ గా కనిపించారు. అయితే.. ఈ వింత డ్రెస్ కి నెట్టింట్లో చాలా ట్రోల్స్ వచ్చాయి. కానీ, ఈ డ్రెస్ ధర తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ డ్రెస్ ఖరీదు ఏకంగా రెండు లక్షల రూపాయలట. ఇది చూసిన నెటిజన్లు.. అమ్మాయిలు వేసుకునే లంగా ఏకంగా రూ.2లక్షలా అని అనుకుంటున్నారు.