Vijay antony : తనతో పాటు నేనూ చనిపోయాను.. కూతురి మరణంపై విజయ్ ఆంటోని ట్వీట్..

- Advertisement -

Vijay antony : విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. మీరా మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. డిప్రెషన్ స్ట్రెస్ తట్టుకోలేక 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది.

vijay antony
vijay antony

మీరా మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటన తమిళ ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. “ప్రియమైన స్నేహితులారా, నా కూతురు మీరా చాలా ప్రేమగా, ధైర్యంగా ఉంటుంది. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం ఈ ప్రపంచం కంటే మెరుగైన ప్రశాంతమైన ప్రదేశానికి ఆమె ఇప్పుడు వెళ్ళింది. ఆమె నాతో మాట్లాడుతోంది. నేను ఆమెతో పాటే చనిపోయాను. నేను ఇప్పుడు ఆమె కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాను. ఇప్పటినుంచి ఏది చేసినా ఆమె కోసమే చేస్తాను.

ఇక నుంచి నేను చేయబోయే మంచి పనులన్నీ ఆమె పేరు మీదనే ప్రారంభిస్తాను” అంటూ పేర్కొన్నారు విజయ్ ఆంటోని. ఈ ట్వీట్ చూసిన అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారని కొందరు చెబుతుంటే, మీకు ధైర్యం, సహనం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ తో కూతురిపై విజయ్ ఆంటోనికి ఎంతటి ప్రేమానురాగాలు ఉన్నాయో స్పష్టమవుతుంది. మరోవైపు మీరా ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలోనే ఓ సూసైడ్ నోట్ దొరికినట్లు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here