Vidya Balan గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేయకుండానే.. ఆ డైరెక్టర్ తో అంటూ ఓపెన్ అయిన విద్యా బాలన్..

- Advertisement -

Vidya Balan విద్యాబాలన్ తెలుగు వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్ నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.. ఇక బాలీవుడ్ లో ఈ అమ్మడికి ఉన్న క్రేజే వేరు.. స్టార్ హీరోయిన్ నుంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసే వరకు ఆమె ఎదిగింది.. తాజాగా విద్యా బాలన్ కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది..

Vidya Balan
Vidya Balan

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటినుంచో ఉన్నప్పటికీ మీటు ఉద్యమం తర్వాత నుంచే.. ఆ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ ఉద్యమం సమయంలో ఎంతోమంది హీరోయిన్స్ సినీ ఇండస్ట్రీలో వారికి అదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా విద్యాబాలన్ కూడా కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఓ డైరెక్టర్ తనని కాఫీకి పిలిచి రూమ్ కి రమ్మన్నాడని కొండ బద్దలు కొట్టింది. అతని పిలుపుతో నేను కూడా రూమ్ కి వెళ్ళానని.. అయితే చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ డైరెక్టర్ మౌనంగా వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది..

Vidya

సౌత్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజులవి. అప్పుడే ఒక యాడ్ ఫిలిం కోసం డైరెక్టర్లు కలిసేందుకు చెన్నై వెళ్లాను. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని కాఫీ షాప్ కి రమ్మని డైరెక్టర్ తో చెప్పాను కానీ ఆ డైరెక్టర్ నన్ను గదికి వెళ్లి మాట్లాడుకుందాం అని చెప్పారు.. అతని ఉద్దేశం ఏంటో అర్థం చేసుకున్న నేను అతనితో పాటే గదికి వెళ్ళినా.. తర్వాత నేను డోర్ లాక్ చేయకుండా.. కొంచెం తెరిచి ఉంచాను. అది గమనించిన ఆ డైరెక్టర్ ఏమీ మాట్లాడకుండా ఐదు నిమిషాల తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయారు.

- Advertisement -

ఆ సమయంలో నేను తెలివిని ప్రదర్శించడం వల్లే తప్పించుకోగలిగాను. ఇప్పటికీ నేను ఆ విషయాన్ని మర్చిపోలేక పోతున్నాను. అదొక్కటే కాదు అలాంటి చేదు అయిన అనుభవాలు ఎన్నో చూశాను . మానసికంగా ఇబ్బందులు పడ్డాను ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి అలా కాలం సమయం పట్టింది అంటూ విద్యాబాలన్ తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని కుండ బద్దలు కొట్టింది. ప్రస్తుతం విద్యాబాలన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక విద్యాబాలన్ పై ఆ డైరెక్టర్ కూడా బాడీ షేవింగ్ కూడా చేశారని వాపోయింది. విద్యాబాలన్ తన అందం, అభినయంతో పాటు టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలో మంచి పేరును పాపులారిటీని సొంతం చేసుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here