Venu Swamy : ప్రముఖ సెలెబ్రిటీల జాతకాలను చెప్తూ నిత్యం ట్రెండ్ లో ఉండే వేణు స్వామి, రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ని మొదటి నుండి రాజకీయాల్లో చూడాలని ఎంతో ఆయాసపడుతూ వస్తున్నారు. ఎందుకంటే 2009 ఎన్నికల సమయం లో ఎన్టీఆర్ పొలిటికల్ ప్రచారం ఒక సంచలనం గా మారింది.
చిన్న వయస్సులోనే పొలిటికల్ పార్టీస్ కి వణుకు పుట్టించాడు, ఇప్పుడు అధికారం లోకి వస్తే వేరే లెవెల్ ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలకు దూరంగా, కేవలం తన సినీ కెరీర్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఆయన రాజకీయాల్లో లేకపోయినా కూడా, పలు సందర్భాలలో ఆయన పేరు చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. అంతే కాకుండా తెలుగు దేశం పార్టీ తదుపరి వారసుడు ఎవరు అనే దానిపై చాలా కాలం నుండి అంతర్గత పోరు నడుస్తుంది.
టీడీపీ పార్టీ పగ్గాలను చేపట్టడానికి ఎన్టీఆర్ కి అన్నీ విధాలుగా అర్హతలు ఉన్నాయని, కాబట్టి ఆయనకే పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నో సంఘటనలకు ఎన్టీఆర్ రెస్పాన్స్ ఇవ్వకపోవడం అభిమానులను సైతం కాస్త ఫ్రస్ట్రేషన్ కి గురి అయ్యేలా చేసింది. కానీ ఎన్టీఆర్ అలా రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండడానికి కారణం వేణు స్వామి అని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వేణు స్వామి చెప్పుకొచ్చాడు.
తిరుమల లో ఎన్టీఆర్ తల్లి కనిపించినప్పుడు, ఆమెతో వేణు స్వామి మాట్లాడాడట. మీ అబ్బాయికి రాజకీయాల్లో రాజయోగం ఉంది, కానీ ఆ అబ్బాయిని 2030 వ సంవత్సరం వరకు రాజకీయాల్లోకి రానివ్వకండి, అప్పటి వరకు ఆయనకీ రాజకీయాల పరంగా గ్రహాలు అనుకూలంగా లేవు అని చెప్పాను. నా మాటకి విలువ ఇచ్చి ఆమె కూడా తన కొడుక్కి అదే చెప్పింది. అందుకే ఎన్టీఆర్ ఇంకా రాజకీయాల్లోకి రాలేదు, 2030 లో కచ్చితంగా వస్తాడు అని చెప్పుకొచ్చాడు.