Venu Swamy : ఆమె కారణంగా నాగ చైతన్య – శోభిత విడిపోతారు అంటూ వేణు స్వామి సంచలన కామెంట్స్!

- Advertisement -

Venu Swamy : సోషల్ మీడియా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన వేణు స్వామి గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది. ఇతని గురించి అందరికీ తెలిసిందే. తన ఇష్టమైన నాయకుడు జగన్ కి తప్ప, ప్రతీ ఒక్కరి జాతకం దరిద్రంగా ఉంది అంటూ సోషల్ మీడియా లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఈ ఏడాది వెలువడిన సార్వత్రిక ఎన్నికలలో వై ఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతాడని, దీనిని ఎవ్వరూ మార్చలేరు అంటూ సోషల్ మీడియా సాక్షిగా ఎన్నో సవాళ్లు చేసాడు. కానీ జగన్ ఈ ఎన్నికలలో అత్యంత దారుణమైన ఫలితాన్ని ఎదుర్కొని కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదాని కూడా దక్కించుకోలేకపోయాడు. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే తన జాతకం తప్పయిందని, ఇక నుండి ఇలా జాతకాలు చెప్పను అంటూ ఒక వీడియో ని విడుదల చేసాడు. మాట మీద నిలబడితే అతను వేణు స్వామి ఎందుకు అవుతాడు, నేడు మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలతో మన ముందుకు వచ్చేసాడు.

Venu Swamy
Venu Swamy

విషయంలోకి వెళ్తే నిన్న అక్కినేని నాగార్జున గెస్ట్ హౌస్ లో నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల జంట నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా వాళ్ళిద్దరి జాతకాలను పరిశీలిస్తూ ఆయన ఒక వీడియో చేసాడు. ఆ వీడియో లో ఆయన మాట్లాడుతూ ‘వైవాహిక జీవితానికి సంబంధించి కలత్ర 7 వ స్థానం లో ఉండాలి. ఒకవేళ అలా లేకుంటే భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడుతాయి. నాగార్జున నిషేధ ముహూర్తం లో ఈ నిశ్చితార్థం ని ఏర్పాటు చేసాడు. ఆగస్టు 8 బలమైన ముహూర్తం అని ఆయన భావించి ఉండొచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Astrologer Venu Swamy Sensational Comments On Naga Chaitanya Sobhita Dhulipala Marriage How Will There Life And What He Said Rv | Venu Swamy Astrology: వేణు స్వామి సంచలనం.. నాగచైతన్య, శోభిత నిశ్చితార్థంపై ...

- Advertisement -

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నాగ చైతన్య – శోభిత కలిసి ఉండాలనే నేను కోరుకుంటున్నాను. కానీ 2027 వ సంవత్సరం నుండి వీళ్ళ మధ్య మనస్పర్థలు, కలతలు ఏర్పడుతాయి. అలా ఏర్పడడానికి ఒక స్త్రీ కారణం. గతం లో కూడా నేను నాగ చైతన్య – సమంత పెళ్లి చేసుకోక ముందే వాళ్ళు విడిపోతారని చెప్పాను. అఖిల్ విషయం లో కూడా అదే చెప్పాను. ఇప్పుడు నాగ చైతన్య – శోభిత విషయం లో కూడా అదే చెప్తున్నాను. కెరీర్ పరంగా ప్రస్తుతం సమంత జాతకం అద్భుతంగా ఉంది, శోభిత కెరీర్ కి అసలు భవిష్యత్తు లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు వేణు స్వామి.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here