Venu Swamy : ఈమధ్య కాలంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కి కాలం బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి. ఒకప్పుడు ఈయనని చాలా కామెడీ గా తీసుకునేవాళ్ళు సోషల్ మీడియా లో ఉండే నెటిజెన్స్. కానీ ఇతను చెప్పినవి కొన్ని జరగడం తో ఇతన్ని స్టార్ సెలబ్రిటీస్ సైతం ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమంత మరియు నాగ చైతన్య విడిపోతారు అని మొట్టమొదట చెప్పింది ఈయనే.

ఈయన చెప్పినట్టుగానే వాళ్లిద్దరూ కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత ప్రభాస్ కి ఇక హిట్టు రాదు అని కూడా చెప్పాడు. కానీ రీసెంట్ గా వచ్చిన ‘సలార్’ సూపర్ హిట్ అయ్యింది కదా అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ సినిమాకి ఫుల్ రన్ లో ఓవరాల్ గా 30 కోట్ల రూపాయలకి పైగా నష్టం వాటిల్లింది. కమర్షియల్ గా యావరేజి గ్రాసర్ అనే చెప్పాలి.

అలాగే నయనతార మరియు సతీష్ దంపతుల విషయం లో కూడా ఇతను చెప్పినవ్వే తూచా తప్పకుండ జరుగుతున్నాయి. వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత అనేక కేసులలో చిక్కుకుంటారు. కోర్టుల చుట్టూ తిరుగుతారు అన్నాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. పెళ్ళైన మూడు నెలలకే సరోగసి కేసులో చిక్కుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా భార్య భర్తలిద్దరూ సినిమాల విషయం లో కోర్టు కేసుల్లో ఇరుక్కున్నారు. రీసెంట్ గానే నయనతార భర్త సతీష్ ‘LIC’ అనే చిత్రాన్ని ప్రారంభించాడు.

దశాబ్దాలుగా పేరున్న సంస్థకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ఊరుకోము, వారం రోజుల్లోపు టైటిల్ మార్చకపోతే క్రిమినల్ కేసులు వేస్తాం అంటూ LIC అధికారులు హెచ్చరించారు. అలాగే నయనతార కూడా ఆమె రీసెంట్ గా చేసిన ‘అన్నపూర్ణి’ అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉంది అంటూ హిందూ సంఘాలు కోర్టు లో కేసు వేసాయి. ఇలా ఈ ఇద్దరు సినిమాల పరంగా కేసుల్లో చిక్కుకున్నారు. ఇలా ఎన్ని రోజులు ఇలా తిరుగుతారో చూడాలి. వేణు స్వామి చెప్పడం వల్లే అలా జరుగుతున్నాయా, లేకపోతే వాళ్ళ జాతకాలు అలాగే ఉన్నాయా అనేది ఆ దేవుడికే తెలియాలి.