MM Keeravani : మహేష్ – రాజమౌళి మూవీ నుండి కీరవాణి అవుట్.. ఆ రాత్రి జరిగిన గొడవే కారణమా?

- Advertisement -

MM Keeravani : మొదటి సినిమా నుండి మొన్న వచ్చిన #RRR వరకు రాజమౌళి తన టీం ని ఇప్పటి వరకు వదిలిపెట్టలేదు. అందుకు కారణం ఆయన సోదరుడు అని కాదు, తాను కోరుకున్నట్టు నూటికి నూరు శాతం తన విజన్ కి మ్యాచ్ అయ్యేలా ట్యూన్స్ ఇస్తాడు కాబట్టి. ఈ కాంబినేషన్ కూడా మోస్ట్ సక్సెస్ ఫుల్ అనే చెప్పాలి. అందుకే #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు వచ్చింది.

MM Keeravani
MM Keeravani

ఎప్పుడో బాహుబలి 2 అప్పుడే సినిమాలు మానేయాలని ఫిక్స్ అయిన కీరవాణిని రాజమౌళి పట్టుబట్టి సినిమాలు కొనసాగించేలా చేసాడు. ఆయన అలా చేసి ఉండకపొయ్యుంటే ఈరోజు మన తెలుగు సినిమాకి ఆస్కార్ ఉండేది కాదేమో. అయితే లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే, త్వరలో మహేష్ తో రాజమౌళి చెయ్యబోయే సినిమా నుండి కీరవాణి తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొద్దిరోజుల క్రితం వాళ్ళ మధ్య జరిగిన చిన్న గొడవేనట.

క్రిస్మస్ వేడుకల్లో అందరూ పాల్గొని పార్టీ చేసుకుంటున్న సమయం లో రాజమౌళి మరియు కీరవాణి మధ్య హీట్ వాతావరణం లో ఒక చర్చ నడిచింది అట. ఆ చర్చ గొడవకి దారి తీసిందని సమాచారం. అప్పటి నుండి రాజమౌళి మరియు కీరవాణి మధ్య మాటలు లేవట. అందుకే వీళ్లిద్దరు కలిసి మహేష్ సినిమాకి పనిచేసే అవకాశం లేదని తెలుస్తుంది.

- Advertisement -

రాజమౌళి కూడా తన సినిమా లోని మ్యూజిక్ ఆడియన్స్ రొటీన్ ఫీల్ అవుతున్నారని, కొత్త టాలెంట్ ని వాడుకుంటే కొత్త రకం మ్యూజిక్ ని అందించిన వాళ్ళం అవుతామని అనుకుంటున్నాడట. ఎందుకంటే ఆయన మహేష్ తో చెయ్యబోతున్న సినిమా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్. అందుకే ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న అనిరుద్ ని రీసెంట్ గానే రాజమౌళి కలిసినట్టు చెప్తున్నారు. మరి అనిరుద్ ఉన్న బిజీ కి రాజమౌళి కి కావాల్సినంత డేట్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here