Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. తరచూ ఏదో ఒక సెలబ్రిటీ జాతకం చెబుతూ నిత్యం వార్తల్లో నిలవడం ఆయనకు అలవాటే. అయితే తాజాగా ఆయన గ్లోబల్ స్టార్ రామ్చరణ్ – ఉపాసన కామినేనిల గారాల పట్టి క్లీంకార గురించి ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు వేణుస్వామి. క్లీంకార జాతకంపై మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

అయితే క్లీంకార పుట్టగానే వేణుస్వామి జాతకం చెప్పారు. ఆమె తల్లి ఉపాసన రాజయోగంలో పుట్టారని అందుకే క్లీంకారతో కూడా అదృష్టం కలిసి వస్తుందని చెప్పారు. అయితే ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు వేణుస్వామిపై ఫైర్ అయ్యారు. పుట్టిన వెంటనే జాతకం చెప్పడం ఏంటని తీవ్రంగా ఫైర్ అయ్యారు. నెటిజన్ల రెస్పాన్స్ మీద వేణుస్వామి రియాక్ట్ అయ్యారు. ఒకింత అసహనానికి గురైన నెటిజన్లకు చిన్న క్లాస్ తీసుకున్నారు.
‘రాజుల కాలంలో రాణి ప్రసవించిన వెంటనే రాజ జ్యోతిష్యులు పిల్లల జాతకం చెప్పారు. దానికి అనుగుణంగా పరిహారాలు చేసుకునేవారు. ప్రముఖులకు పిల్లలు పుట్టినప్పుడు వారి జాతకాలు చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. దాని వలన వాళ్లను అభిమానించే వారు సంతోషిస్తారు. ఏదైనా నష్టంగా ఉంటే వారి కోసం దేవుణ్ని ప్రార్థిస్తారు. బాలారిష్టంతో పుట్టిన పిల్లలకు మాత్రమే వెంటనే జాతకం రాయొద్దని శాస్త్రం చెబుతుంది. బాలారిష్టం ఉన్న పిల్లకు 7వ రోజు, 7వ నెల, 7వ సంవత్సరం, 17వ సంవత్సరం, 37వ సంవత్సరం, 77వ సంవత్సరంలో ప్రాణగండం ఉంటుంది. అందుకే బాలారిష్టం ఉన్న పిల్లల జాతకాలు వెంటనే రాయొద్దని అంటారు.’
‘క్లీంకార రాజయోగంలో పుట్టింది. ఆమె పుట్టిన కారణంగా ఆ కుటుంబానికి కీర్తి సంపదలు వస్తాయి. ఇది తెలియని మూర్ఖులు నేను క్లీంకార జాతకం చెప్పానని ట్రోల్ చేస్తున్నారు.’ అని వేణు స్వామి అసలు సంగతి చెప్పుకొచ్చారు. అయితే వేణుస్వామి క్లారిటీతో క్లీంకార మహర్జాతకంలో పుట్టిందని, ఆమెకు ఎలాంటి ప్రాణ గండం లేదని తేలిపోయింది. వేణు స్వామి గతంలో చెప్పిన చాలా విషయాలు నిజం అయ్యాయి. క్లీంకార విషయంలో కూడా ఆయన జాతకం నిజం అవుతుందని చాలా మంది భావిస్తున్నారు.
2023 జూన్ 20వ తేదీన రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ శుభ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. వీళ్లు తమ గారాలపట్టికి క్లీంకార అనే పేరు పెట్టారు. లలిత సహస్ర నామం నుంతి ఈ పేరు తీసుకున్నట్లు చిరంజీవి వెల్లడించారు.