Venu Swamy : అక్కినేని ఫ్యామిలీలో ఎంత మంది హీరోలు ఉన్నా కానీ అక్కినేని నాగార్జున తప్ప యంగ్ హీరోలు ఎవరు కూడా అంతా అంత స్టార్ డమ్ సాధించుకోలేకపోతున్నారు. నాగచైతన్య ఒకానొక సమయంలో కెరియర్ మంచి హిట్స్ పడ్డాయి. కానీ అక్కినేని అఖిల్ కి మాత్రం ఇంతవరకు కెరీర్ లో ఒక్క హిట్టు కూడా సరైనది పడలేదు. అందుకు కారణం లేకపోలేదు అంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అఖిల్ జాతకం కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అది ముందు నుంచి నేను చెబుతున్న విషయమే. ఆయన జాతకంలో నాగదోషం ఉంది. ఆ నాగ దోషం వల్ల ఆయన సక్సెస్ కాలేకపోతున్నారు. ఆయన అంతటికి ఆయన సొంతంగా సినిమాలు తీస్తే కనుక ఆయన కచ్చితంగా సక్సెస్ అవుతారు అంటే.. ఎవరి నుంచి సలహాలు, నిర్ణయాలు తీసుకోకుండా సినిమాలు తీస్తే కనుక కచ్చితంగా సక్సెస్ అవుతారు.

ఆయన జాతకంలో తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది. నేను ఈ విషయాన్ని గత ఆరు సంవత్సరాల క్రితం అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినప్పుడే చెప్పాను అని వేణు స్వామి అన్నారు.
నాగ దోషం అంటే చంద్రుడు . ఆయన జాతకంలో చంద్రుడు నీచ స్థితిలో ఉండటం ఆయన జీవితం వెనక్కి లాగబడుతుంది అంటే.. ఎక్కువగా అక్కినేని అఖిల్ సినిమాల విషయంలో ఎవరి నిర్ణయాలు తీసుకోకుండా అఖిల్ ని ఫ్రీగా వదిలేస్తే సినిమా హిట్ అవుతుంది. అదే వాళ్ళ అమ్మ ఇన్వాల్వ్మెంట్ వలన సినిమా సెలక్షన్ లో మిస్ అవుతున్నాడు. నేను జాతక పరంగా మాట్లాడుతున్నాను. వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు అని వేణు స్వామి అక్కినేని అఖిల్ జాతకం గురించి చెప్పారు.