Venu Swamy : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ హవా నడుస్తుంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ రావడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి సత్తా ఏంటో తెలిసి వచ్చింది. ఇక ఆస్కార్ అవార్డు రావడం వల్ల మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేం.ఇక అలాంటి పాట రాసిన చంద్రబోస్ కు ఆ పాటకి సంగీతం అందించిన కీరవాణి గారికి అలాగే ఆ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్,కాలభైరవ అలాగే అందులో డ్యాన్స్ చేసిన హీరోలైనా ఎన్టీఆర్, రామ్ చరణ్ లకి మంచి గుర్తింపు లభించింది.. అయితే వీరిద్దరి ఫ్యాన్స్ హీరోలను హైలెట్ చేస్తూ దుమారం రేపుతున్నారు..

ఇక తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ పాత్రపై విమర్శలు చేశారు.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.. సెలెబ్రేటీల జ్యోతిష్యం చెబుతూ హాట్ టాపిక్ అవుతున్న వేణుస్వామి ఇటీవల తారకరత్న మరణం పై ఈయన చేసిన వ్యాఖ్యలు ఎంతగా వైరల్ అయ్యాయో చెప్పనక్కర్లేదు.. ఇప్పుడు ఎన్టీఆర్ పై కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు..ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరగడంతో చాలామంది ఆయన మాటలు నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్ అన్నట్లు ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వైరల్ అయింది..
అంతేకాదు సంక్రాంతి సినిమాలో వెంకటేష్ లా రామ్ చరణ్ అయితే శ్రీకాంత్ ల జూనియర్ ఎన్టీఆర్ అంటూ వివరించి చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో క్లైమాక్స్లో రామ్ చరణ్ పాత్ర ఎక్కువ ఉంటుంది. అందుకని రామ్ చరణ్ నే హైలెట్ అనుకున్నారు. కానీ కొమరం భీముడో సాంగ్లో ఎన్టీఆర్ నటన చూస్తే రామ్ చరణ్ కూడా పనికిరాడు అని మెగా అభిమానులు కొందరు అనడం విశేషం..