Venu Swamy : నిహారిక సంతానం విషయంలో వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు..!

- Advertisement -

Venu Swamy : నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే నిహారిక జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకున్న వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎంతలా చక్కర్లు కొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఈ అంశానికి మరికొన్ని వార్తలు జోడించారు చాలామంది. ఈ క్రమంలోని సెలబ్రెటీల జాతకాలు చెప్పి ఫేమస్ అయిన వేణు స్వామి గతంలోని నిహారిక జాతకం చెప్పారు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని వేణు స్వామి ముందే చెప్పారని అంటున్నారు.

Venu Swamy
Venu Swamy

అంతే కాదు ఆమె జీవితంలో దోషాలు ఎక్కువగా ఉన్నాయని దీని వల్లే విడాకులు తీసుకునే పరిస్థితి వస్తుందని ఈ మెగా డాటర్ మళ్ళీ వివాహం చేసుకున్నప్పుడు సంతానం కలగడం చాలా కష్టమని వేణు స్వామి గతంలో నిహారిక గురించి చెప్పాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు పార్టీలు వెకేషన్స్ అంటూ తరచూ నిహారిక తన స్నేహితులతో ఎప్పుడూ బయట తిరుగుతూ ఉంటుందని.. అంతేకాదు ముందు నుంచి నిహారికని ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కావడంతో ఆమెకి సాంప్రదాయం కట్టుబాట్లు తెలియవు కాబట్టి విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని వేణు స్వామి చెప్పినట్లు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Niharika venu swamy
వేణుస్వామి

ఇక గతంలో వేణు స్వామి చెప్పినట్లుగానే నాగచైతన్య మరియు సమంత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అలాగే నిహారిక కూడా విడాకులు తీసుకుంటారని వేణు స్వామి ముందే చెప్పారు అంటూ ఆయనని ఫేమస్ చేస్తున్నారు చాలామంది. ఈ క్రమంలోని వేణు స్వామి సినీ సెలబ్రిటీల విషయంలో చెబుతున్న విషయాలన్నీ కూడా నిజంగా జరుగుతూ ఉండడంతో పరిహారాల కోసం ఆయన దగ్గరికి వెళ్లే వారి సంఖ్య ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది అని చెప్పాలి. రష్మిక నిది అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లు సైతం పరిహార పూజల కోసం ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఇటీవల రామబాణం హీరోయిన్ డింపుల్ హయాతి సైతం ఆయన చేతుల మీదుగా పూజలు చేయించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here