Venkatesh Maha : కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి.. కంటెంట్ ఉన్న సినిమాలు హిట్ కొడుతూనే ఉంటాయి. కానీ ఒకరికి నచ్చిన సినిమా మరొకరికి నచ్చాలన్నా రూలేమీ లేదు.. కేజీఎఫ్ సినిమా మనందరికీ నచ్చిందని కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా కి నచ్చాలని ఏం లేదు కదా.. తనదైన శైలిలో ఆ సినిమా పేరు కూడా చెప్పకుండా చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యేలా చేస్తున్నాయి..
తాజాగా శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, వెంకటేష్ మహా, నందిని రెడ్డి , మోహనకృష్ణ ఇంద్రగంటి కలసి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సినిమా పేరు చెప్పను ఒక తల్లి తన కొడుకుని గొప్పవాడు అవ్వమని చెబుతుంది. గొప్పవాడు అంటే బాగా సంపాదించి నలుగురికి ఉపయోగపడమని.. కానీ నాకు ఒక ప్రశ్న ఉంది. తల్లి ఒక వస్తువు అడుగుతుంది.. ఆ వస్తువుని తవ్వి తీసే వాళ్ళు ఉంటారు.. వీడు వెళ్లి వాళ్ళని ఉద్ధరిస్తాడు.. ఓ పాట కూడా వస్తుంది.
చివరలో మొత్తం బంగారం తీసుకువెళ్తారు.. నేను స్టోరీ మొత్తం చెప్పేస్తున్నా.. ఆ మహాతల్లిని నాకు కలవాలని ఉంది. ఆడు ఒక నీచ్ కమీన్ కుత్తే.. వాడి చుట్టూ కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళందరినీ వదిలేసి ఆ బంగారాన్ని ఒకచోట పారదొబ్బుతాడు. అలాంటి కుత్తే అవ్వమని తల్లి అడగడం.. అలాంటి కథని సినిమాగా తీస్తే మనం ఎగబడి చూసాం అంటూ వెంకటేష్ మహా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఇంటర్వ్యూ లో ఉన్న నందినీ రెడ్డి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, శివా నిర్వాణ మహా వెంకటేష్ మాట్లాడుతున్న మాటలకు పగలబడి నవ్వారు. నువ్వు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నావు మాకు అర్థమవుతుంది అని చెప్పారు. ప్రస్తుతం వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ వ్యాఖ్యలపై కేజిఎఫ్, యశ్, ప్రశాంత్ నీల్ అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.