Daggubati Venkatesh : స్నేహితుడి కూతురితో విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా.. పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!

- Advertisement -

Daggubati Venkatesh : సోలో హీరోగా విక్టరీ వెంకటేష్ కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ తగిలి చాలా కాలమే అయ్యింది. భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతిలకి విడుదలైన ‘సైన్ధవ్’ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఎలా అయినా భారీ హిట్ కొట్టాలనే కసితో తనకి రెండు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన అనిల్ రావిపూడి తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాడు. నేడే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ చిత్రం లో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.

Daggubati Venkatesh
Daggubati Venkatesh

వెంకటేష్ ఈ చిత్రం లో మాజీ పోలీస్ అధికారి గా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి మాజీ ప్రేయసి గా నటిస్తుంది. ఇక ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ కి భార్య గా ఈ సినిమాలో కనిపించనుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి చిత్రాలంటే ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిది అనే సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఆయన గత చిత్రం ‘భగవంత్ కేసరి’ మాత్రం సీరియస్ సబ్జెక్టు గా తెరకెక్కింది. ఇప్పుడు మళ్ళీ ఆయన ఎంటర్టైన్మెంట్ జానర్ లోకి వచేసాడు. ఇప్పటి వరకు కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, తన విజయపరంపర ని ఈ చిత్రం తో కొనసాగించబోతున్నారు.

Image

- Advertisement -

ఇకపోతే ఈ చిత్రం లో ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాలి. ఈమె తండ్రి రాజేష్ ఒకప్పుడు హీరో గా తెలుగు, తమిళ భాషల్లో రాణించాడు. వెంకటేష్ కి మంచి స్నేహితుడు కూడా. వయసు రీత్యా ఈమె వెంకటేష్ కూతురితో సమానం. అలాంటి అమ్మాయితో ఆయన సినిమా చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఐశ్వర్య రాజేష్ కూడా కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే పోషిస్తూ ఇన్ని రోజులు తన కెరీర్ ని నెట్టుకొచ్చింది. ఈ సినిమాలో కూడా ఆమె నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రనే పోషించబోతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ కాంబినేషన్ రేపు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది అనేది.

Image

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here