Roshan Kanakala : యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన ఎనర్జీ, టైమింగ్ పంచ్‌లకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఎంతో కాలంగా తనదైన యాంకరింగ్‌తో రాణిస్తుంది. సెలబ్రిటీస్ అయినా, సాధారణ ఆడియన్స్ అయినా అందరికి తన పంచ్ డైలాగ్స్‌తో ఇచ్చి పడేస్తుంది. యాంకరింగ్‌తో ఎంతో వినోదం పంచే సుమ నాలుగు పదుల వయసులోనూ అంతే ఎనర్జీతో స్టార్ యాంకర్‌గా కొనసాగతుంది. ఇప్పటికీ ఆమెకు బీట్ చేసే యాంకర్స్ లేరనడంతో సందేహం లేదు. ఎన్నో స్టేజ్‌లపై స్టార్ హీరో సైతం సుమ యాక్టివ్, ఎనర్జీకి సీక్రెట్ సర్ప్రైజ్ అవుతుంటారు. ఇక ఇండస్ట్రీలో చాలా మంది తమకు సుమ ఇన్స్పరేషన్ అని చెబుతుంటారు. ఈ మధ్యే సుమ కొడుకు రోషన్ కూడా బబుల్ గమ్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
బబుల్ గమ్ సినిమా ద్వారా తన టాలెంట్ జనాలకి చూపించాలి అనుకున్నాడు రోషన్ కనకాల. కానీ అది బాక్సాఫీస్ వద్ద మిస్ ఫైర్ అయింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ దక్కించుకుంది. ఈ సినిమా యూత్ కు తప్పితే సాధారణ జనాలకు నచ్చలేదు. మరి ముఖ్యంగా ఈ సినిమాల్లో హై ఓల్టేజ్ బోల్డ్ పర్ఫామెన్స్ చూపించాడు రోషన్. అయితే రీసెంట్గా రోషన్ కనకాల తన రెండో సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఈసారి కొడుకు ఎలాగైనా ఇండస్ట్రీలో నిలబెట్టాలని పకడ్బందీగా ప్లాన్ చేసిందట సుమ. మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ వైష్ణవి చైతన్యను తన కొడుకు సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసిందట. బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది వైష్ణవి చైతన్య . ఇప్పుడు సుమ కొడుకు రోషన్ కనకాలతో రొమాన్స్ చేయడానికి రెడీ అయిందన్న న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. చూడాలి మరి తెరపై ఈ జంట ఏ రేంజ్ లో జనాలను ఎట్రాక్ట్ చేస్తుందో.